పిఎంఇండియా
దశాబ్దం క్రితం ప్రారంభమై… భారతదేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ప్రధాన ఘట్టంగా నిలిచిన ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ) పరివర్తనాత్మక ప్రస్థానాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు.
గత పదేళ్లలో యూపీఐ సాధించిన విస్తరణ, స్థాయి గురించి వివరిస్తూ.. ప్రతి భారతీయుడూ గర్వపడేలా ఈ ప్రయాణం ఉందని శ్రీ మోదీ అన్నారు. యూపీఐ వినియోగంలో ఎదురైన అనుభవాలతో పాటు అది తమ దైనందిన జీవితాలను ఎలా ప్రభావితం చేసిందో పంచుకోవాలని ప్రధానమంత్రి ప్రజలను ఆహ్వానించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి చేసిన పోస్టు:
భారత దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ప్రధాన మలుపుగా నిలుస్తూ దశాబ్దం కిందట యూపీఐ ప్రారంభమైంది.
ప్రతి భారతీయుడు గర్వపడేలా యూపీఐ విస్తరణ, విస్తృతి ఉన్నాయి.
మీ యూపీఐ అనుభవం గురించి, అది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో నాకు చెప్పండి.
#10YearsOfUPI
A decade ago, UPI was rolled out, marking a major turning point in India’s digital payments journey.
— Narendra Modi (@narendramodi) August 25, 2026
The sheer scale and reach of UPI are something every Indian must be proud of.
Tell me about your UPI experience and how it impacted your life... #10YearsOfUPI pic.twitter.com/Xtto6V6gpU