పిఎంఇండియా
సజ్జన సావాసం, వివేకం గల సలహాలూ విలువైనవని బోధిస్తున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. వివేకవంతుల సాంగత్యం, పవిత్ర ఆలోచనలు, స్వార్థానికి చోటీయని స్నేహం.. ఇవి పరిపూర్ణ, శాంతియుత జీవితానికి ఎంతయినా అవసరమని ఎప్పటికీ గుర్తు చేసే సందేశాన్ని ఈ సుభాషితం మనకు అందిస్తోంది:
‘‘ఉత్తమైః సహ సాంగత్యం పండితైః సహ సత్కథామ్, అలుబ్ధైః సహ మిత్రత్వం కుర్వాణో నావసీదతి’’.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ, ‘‘ఉత్తమైః సహ సాంగత్యం పండితైః సహ సత్కథామ్, అలుబ్ధైః సహ మిత్రత్వం కుర్వాణో నావసీదతి’’ అని పేర్కొన్నారు.
***
उत्तमैः सह साङ्गत्यं पण्डितैः सह सत्कथाम्।
— Narendra Modi (@narendramodi) August 25, 2026
अलुब्धैः सह मित्रत्वं कुर्वाणो नावसीदति॥ pic.twitter.com/SCziLeJ7FX