Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పోఖ్ రణ్ లో ఐ ఎ ఎఫ్ విన్యాసాల ప్రదర్శనను వీక్షించిన‌ ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాజస్థాన్ లోని థార్ ఎడారిలో పోఖ్ రణ్ వద్ద భారతీయ వైమానిక దళ విధినిర్వహణ సామర్థ్యాల ప్రదర్శనను తిలకించారు.

‘ఐరన్ ఫిస్ట్ 2016’ పేరిట సాగిన ఈ సాధన.. సాయుధ బలగాల సర్వ సైన్యాధ్యక్షుడైన‌ రాష్ట్ర‌పతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో.. జరిగింది.

వైమానిక దళం ఇటు దండయాత్ర చేయడంలోను, అటు శత్రు దాడుల బారి నుంచి కాచుకోవడంలోను తనకు ఉన్న పూర్తి శ్రేణి సత్తాను ఈ సందర్భంగా ప్రదర్శించింది. ఇందులో భాగంగా వలలను ఉపయోగించుకొంటూ జరిపే విన్యాసాలు, గగన తల రక్ష‌ణ‌ విన్యాసాలు, పోరాటానికి మద్దతుగా చేపట్టే విన్యాసాలు, ఏరోబాటిక్ డిస్ ప్లే లు, బహుళవిధ కార్యకలాపాలు, ఏ విధమైనటువంటి వాతావరణానికైనా ఎదురొడ్డి నిలుస్తూ జరిపే విన్యాసాలు చోటు చేసుకొన్నాయి.

”నిప్పులు చిమ్మే వైమానిక దళం శక్తిని, ప్రవీణులైన వైమానిక దళ యోధుల యుక్తిని చూసి మా గుండెలలో గర్వం గొప్పగా ఉప్పొంగిపోయింది” అంటూ ప్రధాన మంత్రి తన మనోభావాలను ట్విటర్ లో పంచుకొన్నారు.

***