Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రజా జీవితంలో 25 ఏళ్ల ప్రస్థానాన్ని తీర్చిదిద్దిన సేవా, లక్ష్యం, దృఢ విశ్వాసం, ధైర్యం విలువలను తెలియజేసే కథనాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


సేవా, లక్ష్యం, దృఢ విశ్వాసం, ధైర్యసాహసాల విలువలతో సాగిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని తెలియజేసేలా దాజీ (శ్రీ కమలేశ్ పటేల్) రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి ప్రజలతో పంచుకున్నారు.

శ్రీ నరేంద్ర మోదీ తొలిరోజుల్లో అంకితభావంతో కూడిన సేవ నుంచి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు అచంచలమైన సేవాభావమే మార్గదర్శక సూత్రంగా నిలిచిందని దాజీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.

‘‘సేవా, లక్ష్యం, దృఢ విశ్వాసం, ధైర్యసాహసాలతో సాగిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా పాలనను దాజీ (శ్రీ కమలేశ్ పటేల్) గుర్తుచేసుకున్నారు. తొలినాళ్ల నుంచి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా సాగిన శ్రీ నరేంద్ర మోదీ ప్రయాణంలో సేవాభావం నిరంతరం కొనసాగింది’’ అని పేర్కొన్నారు.

 

***