పిఎంఇండియా
దేశంలో మరో మూడు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థల (ఎయిమ్స్) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (ఆ రోగ్య సురక్ష పథకం) కింద మహారాష్ట్రలోని నాగ్‌పూర్, ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి, పశ్చిమ బెంగాల్ లోని కల్యాణిలో కొత్త ఎ యిమ్స్ లు ఏర్పాటవుతాయి. ఇందుకోసం రూ.4,949 కోట్లను వెచ్చిస్తారు.
నాణ్యమైన వైద్య విద్యను, నర్సింగ్ విద్యను అందించేందుకు, ఆ యా ప్రాంతాల్లోని ప్రజలకు దగ్గర్లో మంచి వైద్య సదుపాయాలు అందించేందుకు వీలుగా కొత్త ఎ యిమ్స్ లను జాతీయ ప్రాముఖ్యంగల సంస్థలుగా తీర్చిదిద్దుతారు. ప్రతిపాదిత సంస్థల ఒ క్కో దాంట్లో 960 పడకల సామర్థ్యం గల ఆస్పత్రి ఉంటుంది. దీనికి తోడు బోధనకు ప్రత్యేక సముదాయము, పరిపాలనా భవనము, ఆ యుష్ భవనం, ఆడిటోరియం, నర్సింగ్ కళాశాల, రాత్రి బసకు వసతి, హాస్టల్, నివాస భవనాలు ఉంటాయి.
మొత్తం రూ.4,949 కోట్ల వ్యయంలో ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఏర్పాటు చేసే ఎయిమ్స్ కోసం రూ.1,618 కోట్లు ఖర్చు చేస్తారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ఎయిమ్స్ కోసం రూ.1,577 కోట్లు, పశ్చిమబెంగాల్‌లోని కల్యాణి ఎయిమ్స్‌కి రూ.1,754 కోట్లు ఖర్చు చేస్తారు. ఆయా ప్రాంతాల్లో వి శ్వసనీయ ప్రాదేశిక వైద్య సేవల్లోనూ, ప్రజారోగ్య సదుపాయాల అందుబాటులోనూ ఉన్న ప్రాంతీయ అసమానతలను ఎ యిమ్స్ ఏర్పాటు ద్వారా సరిచేసే అ వకాశం ఉంది. నాణ్యమైన వైద్య విద్యకు ఇవి మరింత ఊపునిస్తాయి. ఆయా ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య నిపుణుల కొరతను కూడా ఇవి పరిష్కరిస్తాయి.
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర (విదర్భ), పశ్చిమబెంగాల్‌లోని ప్రజానీకంతో వాటికి ఇ రుగు పొరుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఈ పథకం వల్ల లబ్ధి పొందుతారు.
ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద ఇప్పటికే 6 కొత్త ఎ యిమ్స్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. రాయ్‌బరేలీలో మరో ఎ యిమ్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
నేపథ్యం:
ఎ యిమ్స్ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి 2014-15 బడ్జెట్ ప్రసంగంలో చేసిన ప్రకటన మేరకు, కేబినెట్ మూడు కొత్త ఎ యిమ్స్‌కు ఆ మోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్‌లో ఎ యిమ్స్ తరహా సంస్థను ఏర్పాటు చేస్తామని పునర్విభజన చట్టం-2014లో ఇచ్చిన వాగ్దానాన్ని కూడా దీంతో పూర్తి చేసినట్టైంది.
Cabinet approved setting up of 3 new AllMS at Nagpur in Maharashtra, at Manglagiri in Andhra Pradesh and at Kalyani in West Bengal.
— PMO India (@PMOIndia) October 7, 2015
New AIIMS will be established for providing quality medical education, nursing education and also to provide tertiary healthcare facilities
— PMO India (@PMOIndia) October 7, 2015
People of Andhra Pradesh, Maharashtra (Vidarbha) & West Bengal along with adjoining States and region will be beneficiary of this project.
— PMO India (@PMOIndia) October 7, 2015