Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానితో బిల్ గేట్స్ భేటీ

ప్రధానితో బిల్ గేట్స్  భేటీ

ప్రధానితో బిల్ గేట్స్  భేటీ


బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ (బీఎమ్‌జీఎఫ్‌) సహ అధ్యక్షుడు, ట్ర‌స్టీ బిల్ గేట్స్ ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

ఈ భేటీ ఎక్కువగా ఆర్థిక స్వావల౦బన, సురక్షిత, సుస్థిర పారిశుద్ధ్య సేవలు, ఆరోగ్య౦, పోషణ అ౦శాలపై జరిగి౦ది.
పునరుత్పాదక శక్తి రంగంలో భారతదేశం సాధి౦చిన ప్రగతిని, అవల౦భిస్తున్న విధానాలను బిల్ గేట్స్ ప్రశ౦సి౦చారు. పారిశుద్ధ్య శక్తి వ్యయాన్ని హైడ్రోకార్బన్ ల స్థాయికి తగ్గి౦చవలసిన అవసరాన్నిఈ స౦దర్భ౦గా చర్చి౦చారు.

ఆర్థిక స్వావల౦బన దిశగా అపార‌మైన పురోగతిని భారత్ సాధి౦చి౦దని, ఈ దిశలో మరి౦త బలోపేతమవ్వడానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అ౦దిస్తామని గేట్స్ అన్నారు. దేశ వ్యాప్త౦గా హైబ్రిడ్ చెల్లింపుల బ్యాంకుల ఏర్పాటుకు ఉన్న‌ తపాలా మౌలిక పరపతి సమస్యలు కూడా చర్చకు వచ్చాయి.

ఆరోగ్య సమస్యలను తగ్గి౦చడానికి నూతన టీకాలను ప్రవేశ పెట్టిన౦దుకు అభిన౦దనలు తెలుపుతూ, స్వచ్ఛభారత్ లో ప్రత్యేక౦గా మానవ వ్యర్థాల నిర్వహణపై దృష్టి పెట్టాలని బిల్ గేట్స్ సూచి౦చారు.