Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానిని కలిసిన విఖ్యాత మలయాళీ సాహితీవేత్తలు… రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చినందుకు కృతజ్ఞతలు


కేరళ పేరును కేరళంగా మార్చడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ ప్రముఖ మలయాళీ సాహితీవేత్తల బృందం ఈ రోజు ప్రధానమంత్రిని కలిసింది.

ప్రముఖ మలయాళ సాహితీవేత్తలను కలవడం తనకెంతో సంతోషాన్నిచ్చిందనీ, వారితో చర్చలు అత్యంత జ్ఞానదాయకంగా సాగాయనీ ప్రధానమంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా కేరళం రాష్ట్రం పట్ల, మలయాళ భాష పట్ల వారి మమకారానికీ, అంకితభావానికీ ఈ సమావేశం అద్దం పట్టిందంటూ కొనియాడారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘కేరళ పేరును కేరళంగా మార్చడం పట్ల కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చిన ప్రముఖ మలయాళ సాహితీవేత్తల బృందానికి స్వాగతం పలకడం సంతోషాన్నిస్తోంది. వారితో చర్చలు అత్యంత జ్ఞానదాయకంగా సాగాయి. కేరళం రాష్ట్రం పట్ల, మలయాళ భాష పట్ల వారి మమకారానికి, అంకితభావానికి ఈ సమావేశం అద్దం పట్టింది.  

 

***