Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రికి తమ సూచనలు, సలహాలు నివేదించిన కార్యదర్శుల రెండు బృందాలు


పరిపాలనకు సంబంధించిన వేరు వేరు రంగాలలో తీసుకురాదగిన మార్పులపై సూచనలు, సలహాలతో ముందుకు రావాలని కార్యదర్శులకు ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా, ఈ రోజు (2016 జనవరి 20న) కార్యదర్శుల బృందాలు రెండు తమ ఆలోచనలను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి సమర్పించాయి. వారి ఆలోచనలు (i) సుపరిపాలన: సవాళ్లు-అవకాశాలు, (ii) వ్యవసాయం మరియు సంబంధిత రంగాలలో రైతు ప్రధానమైన అంశాలకు సంబంధించినవి.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శ్రీ రాజ్ నాథ్ సింగ్, శ్రీమతి సుష్మ స్వరాజ్, శ్రీ నితిన్ గడ్కరీ, శ్రీ మనోహర్ పార్రీకర్ లతో పాటు భారత ప్రభుత్వ కార్యదర్శులు పాల్గొన్నారు. కార్యదర్శుల బృందాలు ప్రధాని సమక్షంలో ప్రెజెంటేషన్ ఇస్తుండగానూ, ఆ ప్రెజెంటేషన్ ముగిసిన తరువాత సభికులలో పలువురు ప్రజెంటేషన్ ఇతివృత్తాల‌కు సంబంధించి ప్రశ్నలు అడగడమే కాకుండా ఆయా అంశాలపై తమ సూచనలను కూడా వ్యక్తం చేశారు.