Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన’ లబ్ధిదారుల సంఖ్య 2 కోట్లను అధిగమించినందుకు సంతోషం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘పి ఎం ఉజ్జ్వల యోజన’ లబ్ధిదారుల సంఖ్య ఒక సంవత్సరం కన్నా తక్కువ కాలం లోపలే 2 కోట్లను మించినందుకుగాను హర్షం వ్యక్తం చేశారు.

‘‘ఒక ఏడాది కన్నా తక్కువ కాలం లోపలే పి ఎం ఉజ్జ్వల యోజన లబ్ధిదారుల సంఖ్య 2 కోట్లు దాటిపోవడం చాలా గొప్ప ఆనందాన్నిస్తోంది; గర్వంగానూ ఉంది.

పేద మహిళల జీవితాలలో ఒక గుణాత్మకమైన మార్పును తీసుకురావాలనే ఒక బలమైన నిబద్ధత ఉజ్జ్వల యోజనకు మార్గదర్శకత్వం వహిస్తోంది.

ఉజ్జ్వల యోజన లబ్ధిదారులందరిని మరియు ఇది విజయవంతం కావడం కోసం అవిశ్రాంతంగా పాటుపడుతున్న వారిని నేను అభినందిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.