Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి కోక్రాఝార్ లో దాడిని తీవ్రంగా ఖండించారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అస్సాం లోని కోక్రాఝార్ లో జరిగిన దాడి పట్ల దు:ఖం వ్యక్తం చేశారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.

“కోక్రాఝార్ లో జరిగిన దాడి దు:ఖదాయకం; దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘటనలో తమ సన్నిహితులను కోల్పోయిన కుటుంబాల యొక్క శోకంలో నేను పాలుపంచుకొంటున్నాను. గాయాల బారినపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

అస్సాం ప్రభుత్వంతో హోం శాఖ సంప్రదింపులు జరుపుతూంది. అక్కడి స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది” అని ప్రధాన మంత్రి అన్నారు.