Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి జిఎస్టి బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడంపై అన్ని రాజకీయ పార్టీల సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జి ఎస్ టి బిల్లు రాజ్య సభ లో ఆమోదం పొందిన సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులకు మరియు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. జి ఎస్ టి సహకారాత్మక సమాఖ్య అనే భావనకు ఒక ఉత్తమమైన ఉదాహరణ అని ఆయన చెబుతూ, ఈ సంస్కరణ ‘మేక్ ఇన్ ఇండియా’ కు ఊతంగా నిలువగలదని, ఎగుమతులకు దోహదపడగలదని, తద్వారా ఉపాధికల్పన జోరు అందుకొంటుందని, అలాగే ఆదాయం కూడా పెరుగుతుందంటూ వరుస ట్వీట్ లలో తన స్పందనను వ్యక్తం చేశారు.

“రాజ్య సభలో జి ఎస్ టి బిల్లు ఆమోదం పొందిన ఈ సిసలైన చారిత్రక సందర్భంలో అన్ని పార్టీల నాయకులకు మరియు సభ్యులకు ఇవే నా ధన్యవాదాలు.

21వ శతాబ్దంలో భారతదేశానికి పరోక్ష పన్నుల వ్యవస్థను అందించేందుకు ఒక మేలు మలుపు అనదగిన నిర్ణయాన్ని తీసుకున్న మన ఎంపీలను అభినందించి తీరాలి.

భారతీయులందరికీ మేలు చేకూర్చే, చైతన్యశీలమైన ఏకీకృత‌ జాతీయ విపణిని వృద్ధిపరచే ఒక వ్యవస్థ ను పరిచయం చేసేటందుకు మేం అన్ని పార్టీలతోను, రాష్ట్రాలతోను కలసి పనిచేస్తూనే ఉంటాము.

ఈ సంస్కరణ ‘మేక్ ఇన్ ఇండియా’ కు మద్దతునివ్వగలదు. ఎగుమతులకు తోడ్పడగలదు; దీని ద్వారా ఉపాధికి ఊతం లభించగలదు. అలాగే, ఆదాయం అధికం అవుతుంది కూడా.

మరొక విషయాన్ని కూడా నేను చెప్పదలుస్తున్నాను.. జి ఎస్ టి సహకారాత్మక సమాఖ్య తత్వానికి ఒక ఉత్తమమైన ఉదాహరణ కూడాను. మనం అందరం కలసి భారతదేశాన్ని పురోగతి పథంలో నూతన మైలురాళ్లను నెలకొల్పేటట్లు చేద్దాము” అని ప్రధాన మంత్రి తన మనోభావాలను ట్విటర్ లో వెల్లడించారు.