Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తో జోర్డాన్ కు చెందిన రాయల్ హాశిఎయిట్ కోర్టు ప్రముఖుడు డాక్టర్ ఫైజ్ తారవానెహ్ భేటీ

ప్రధాన మంత్రి తో జోర్డాన్ కు చెందిన రాయల్ హాశిఎయిట్ కోర్టు ప్రముఖుడు డాక్టర్ ఫైజ్ తారవానెహ్ భేటీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని జోర్డాన్ కు చెందిన రాయల్ హాశిఎయిట్ కోర్టు ప్రముఖుడు డాక్టర్ ఫైజ్ తారవానెహ్ 2017 మార్చి 10వ తేదీ శుక్రవారం నాడు కలుసుకొన్నారు.

ఈ సందర్భంగా వారు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని, ఈ విషయంలో అనేక అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పశ్చిమ ఆసియా లో పరిస్థితి పైన, అంతర్జాతీయ స్థాయిలో విస్తృత‌మైన‌ ప్రతిస్పందన అవసరమైన ఉగ్రవాదం పైన డాక్టర్ ఫైజ్ తారవానెహ్ తన అభిప్రాయాలను ప్రధాన మంత్రికి తెలియజేశారు.

ప్రధాన మంత్రికి జోర్డాన్ రాజు మాన్య శ్రీ రెండవ అబ్దుల్లా ఇబ్ న్ అల్ హుస్సేన్ తరఫున డాక్టర్ ఫైజ్ తారవానెహ్ అభినందనలు తెలిపారు.