Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తో టెలిఫోన్ లో మాట్లాడిన బ్రిటిషు ప్రధాని


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బ్రిటిషు ప్రధాని థెరెసా మే ఈ రోజు టెలిఫోన్ లో సంభాషించారు.

ఉభయ ప్రధానులు ఒకరికి మరొకరు ఇటీవలే ముగిసిన దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

శాస్త్ర విజ్ఞానం- సాంకేతిక విజ్ఞానం, ఫైనాన్స్, వ్యాపారం-పెట్టుబడి, ఇంకా రక్షణ మరియు భద్రత రంగాలు సహా అనేక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలపరచుకొనేందుకు గణనీయమైన అవకాశాలు ఉన్నాయని ఇరువురు నేతలు అంగీకరించారు.

వచ్చే వారంలో భారతదేశ పర్యటనకు విచ్చేయనున్న థెరెసా మే ను సాదరంగా స్వాగతించేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. యూరోప్ నకు వెలుపల థెరెసా మే జరపబోయే ప్రప్రథమ ప్రముఖ ద్వైపాక్షిక పర్యటన ఇదే కానుంది.