Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి వారణాసి లో అభివృద్ధి పనులను ప్రారంభించి, బహిరంగ సభలో ప్రసంగించారు

ప్రధాన మంత్రి వారణాసి లో అభివృద్ధి పనులను ప్రారంభించి, బహిరంగ సభలో ప్రసంగించారు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వారణాసి లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

వీటిలో 765/400 కెవి జిఐఎస్ వారణాసి విద్యుత్తు సబ్-స్టేషన్ ను జాతికి అంకితం చేయడం; వారణాసి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు కు పునాదిరాయి వేయడం; వారణాసి పోస్టల్ రీజియన్ ప్రారంభోత్సవం; డీజిల్ లోకోమోటివ్ వర్క్ స్ (ఒకటో దశ) విస్తరణ పథకం; అలహాబాద్- వారణాసి రైలుమార్గం విద్యుద్దీకరణ మరియు రెండో మార్గం నిర్మాణ పనులకు పునాదిరాయిని వేయడం; ఇంకా.. రాజాతాలాబ్ రైల్వేస్టేషన్ లో త్వరగా పాడయ్యే సరకుల కేంద్రం ఏర్పాటు వంటివి ఉన్నాయి.

ప్రధాన మంత్రి ఎంపిక చేసిన సుకన్య స‌మృద్ది యోజన లబ్ధిదారులను సన్మానించారు. అంతే కాకుండా ఎంపిక చేసిన ఉజ్జ్వల లబ్ధిదారులకు ఎల్ పి జి కనెక్షన్ లను అందజేశారు. ఆయన వారణాసి నగరంపై ఒక స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, ప్రజలు వారి దీపావళి పర్వదిన సందేశాలను సైనికులకు పంపించాలని ప్రధాన మంత్రి కోరారు.

ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంపై కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకొంటోందని, పునాదిరాళ్లు వేయడమే కాకుండా ఆయా ప్రాజెక్టులు సకాలంలో ఆరంభం అయ్యేటట్లు దృష్టి సారించింద‌ని ప్రధాన మంత్రి చెప్పారు. ప్రాజెక్టులను సరైన విధంగా అమలుపరచి, ప్రజల జీవనానికి తగిన మేలు చేకూర్చడమే ప్రభుత్వ కార్యక్రమాల సిసలైన ధ్యేయం అని ఆయన అన్నారు.

పర్యావరణ మైత్రిపూర్వక కార్యక్రమాలను గురించి, ఆర్థిక వ్యవస్థ వృద్ధి కి చోదక శక్తిగా నిలువగల భారతీయ రైల్వేల విషయంలో ప్రభుత్వం కొత్తగా అమలుచేయనున్న విధానాన్ని గురించి ప్రధాన మంత్రి వివరించారు.

***