Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రపంచంలో ఒక స్థానాన్ని సంపాదించే దిశగా కృషి చేయాలని రత్నాలు మరియు ఆభరణాల పరిశ్రమకు విజ్ఞ‌ప్తి చేసిన ప్రధాన మంత్రి

ప్రపంచంలో ఒక స్థానాన్ని సంపాదించే దిశగా కృషి చేయాలని రత్నాలు మరియు ఆభరణాల పరిశ్రమకు విజ్ఞ‌ప్తి చేసిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ భారతదేశంలోని రత్నాలు మరియు ఆభరణాల రంగాన్ని దేశీయ విపణి కి ఆవలి వైపునకు దృష్టిని సారించి ప్రపంచంలో తనకంటూ ఒక ఉనికిని సంపాదించుకోవలసిందిగా కోరారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి నవకల్పనకు, నైపుణ్యాల అభివృద్ధికి కృషి చేయాలని శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

ఆలిండియా జెమ్స్ అండ్ జూవలరీ ట్రేడ్ ఫెడరేషన్ ఈ రోజు ప్రధాన మంత్రికి ఒక అభినందన ఉత్సవాన్ని నిర్వహించగా, అందులో శ్రీ మోదీ పాల్గొని ప్రసంగించారు. చేతులతో తయారు చేసే నగలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ నానాటికీ పెరుగుతూపోతోందని ఆయన తెలిపారు.

ఎక్సైజ్ సుంకానికి సంబంధించిన ఇటీవలి అంశాలను ప్రధాన మంత్రి గుర్తుకు తెస్తూ, ఈ అంశాలు రత్నాలు మరియు ఆభరణాల పరిశ్రమ ప్రభుత్వ పనితీరును మరింత లోతుగా అర్థం చేసుకొనేందుకు ఒక అవకాశాన్ని ప్రసాదించాయని, అంతే కాకుండా ఈ రంగంలో ఇమిడిన సంకటాలను క్షుణ్నంగా అవగతం చేసుకొనేందుకు ప్రభుత్వానికి కూడా అవకాశం కల్పించాయని చెప్పారు. రత్నాలు మరియు ఆభరణాల రంగం, ప్రభుత్వం ఈ రెండు పక్షాలు కూడా ఒకదానిపై మరొకటి పైచేయిని సాధించాయని ఆయన అన్నారు.

బయటకు వెల్లడి చేయని ఆదాయం కలిగివున్న వారంతా అటువంటి ఆదాయం వివరాలనుసెప్టెంబరు 30 వ తేదీ కన్నా పూర్వమే బహిరంగపరచాలని ప్రధాన మంత్రి సూచించారు.