Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రభుత్వాధినేతగా దేశ సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్‌కు ధన్యవాదాలు తెలియజేసిన ప్రధాని


ఆప్యాయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. గత ఏప్రిల్‌లో ఆయన భారత్‌లో పర్యటించిన విషయాన్ని ఈ సందర్భంగా సానుకూల ధోరణితో గుర్తుచేసుకున్నారు. ఆ పర్యటన భారత్-దక్షిణ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి నూతన ఊపునిచ్చిందని పేర్కొన్నారు.

 

రెండు దేశాలు తమ బహుముఖ సహకారాన్ని మరింతగా బలోపేతం చేసుకుంటాయని.. ప్రపంచ శాంతి, స్థిరత్వం, సమృద్ధి కోసం కలిసి పనిచేయడం కొనసాగిస్తాయని శ్రీ నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

 

“అధ్యక్షులు లీ జే-మ్యుంగ్.. మీ ఆప్యాయపూర్వక సందేశానికి ధన్యవాదాలు.

 

గత ఏప్రిల్‌లో మీరు భారత్‌లో చేపట్టిన పర్యటనను నేను సానుకూలంగా గుర్తుచేసుకుంటున్నాను. ఇది మన ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి సరికొత్త ఉత్తేజాన్ని అందించింది.

 

మన బహుముఖ సహకారాన్ని మరింత దృఢంగా మార్చుకోవడానికి.. ప్రపంచ శాంతి, స్థిరత్వం, సమృద్ధి కోసం మన ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మనం కలిసి కృషి చేస్తామన్న పూర్తి విశ్వాసం నాకు ఉంది.”