Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ ఎల్ కే అద్వానీని కలసి ఆశీస్సులు తీసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాజీ ఉపప్రధాని శ్రీ ఎల్.కే. అద్వానీని ఆయన నివాసంలో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. దేశ పురోగతి కోసం దశాబ్దాల పాటు అద్వానీ చేసిన ప్రజా సేవ, జాతీయ రాజకీయాల్లో ఆయన పోషించిన అసాధారణ పాత్రను ప్రధాని ప్రశంసించారు. దేశ ప్రగతి పయనంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.

 

‘‘శ్రీ అద్వానీని ఆయన నివాసంలో కలసి ఆశీస్సులు తీసుకున్నాను. దశాబ్దాలుగా ఆయన అందించిన ప్రజా సేవ, జాతీయ జీవితంలో ఆయన వహించిన పాత్ర మన దేశ పురోగతిపై చెరగని ముద్ర వేశాయి. భారతదేశ ప్రగతిని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర అసాధారణమైనది” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.