Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రభుత్వాధినేతగా దేశ సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా


తనకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపిన జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది జూలైలో ఆమె భారత్‌లో పర్యటించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ… ఆ పర్యటన భారత్-జపాన్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిన ఒక మరపురాని సందర్భమని అభివర్ణించారు. తమ చిరకాల స్నేహాన్ని ఆధారంగా చేసుకుని… ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం భారత్, జపాన్ కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. భారత్-జపాన్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం… ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

 

ప్రధానమంత్రి తకైచి గారూ… మీకు చాలా ధన్యవాదాలు.

 

ఈ జూలైలో మీ భారత్‌ పర్యటన భారత్-జపాన్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిన చిరస్మరణీయ సందర్భం.

 

మన రెండు దేశాలు తమ దీర్ఘకాలిక స్నేహాన్ని ముందుకు తీసుకువెళుతున్న తరుణంలో… ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం మనం కలిసి పనిచేయడం కొనసాగించుదాం.

 

మన దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవ సందర్భంలో… మన ద్వైపాక్షిక సంబంధాలు కొత్త శిఖరాలను చేరుతాయని నాకు పూర్తి విశ్వాసం ఉంది.