Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రభుత్వాధినేతగా దేశ సేవలో 25 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వుచిచ్‌కు ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి


ఆప్యాయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వుచిచ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. భారత్-సెర్బియా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో సెర్బియా అధ్యక్షుడు వ్యక్తిగతంగా అందిస్తున్న సహకారాన్ని తాను ఎంతో అభినందిస్తున్నట్లు ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

 

“మీ హృదయపూర్వక మాటలకు, స్నేహభావానికి ధన్యవాదాలు.

 

భారత్-సెర్బియా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మీ వ్యక్తిగత సహకారాన్ని నేను ఎంతో అభినందిస్తున్నాను.

 

మీ నాయకత్వంలో సెర్బియా అసాధారణ పరివర్తనను సాధించింది. మీరు దృఢ నిశ్చయం, అంకితభావంతో సెర్బియాకు సేవచేశారు.

 

భారత్-సెర్బియా భాగస్వామ్యాన్ని మరింత అత్యున్నత శిఖరాలకు చేర్చడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.”