పిఎంఇండియా
దేశ సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్టినాండ్ మార్కోస్ జూనియర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి, స్నేహభావాన్ని మరింతగా బలపరచడానికి కృషి చేస్తామని ప్రధాని పునరుద్ఘాటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
“అధ్యక్షులు ఫెర్టినాండ్ మార్కోస్ జూనియర్.. శుభాకాంక్షలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
ఫిలిప్పీన్స్‌తో కలిగి ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఎంతో విలువైనదిగా భారత్ భావిస్తుంది. మన దేశాల మధ్య నిరంతర భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి, మన ఉమ్మడి స్నేహాన్ని మరింత బలోపేతం చేయడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.”
Thank you, President Ferdinand Marcos Jr., for your wishes. India deeply values its Strategic Partnership with the Philippines. I look forward to our continued engagement and further deepening of the friendship between our nations. @bongbongmarcos
— Narendra Modi (@narendramodi) October 7, 2026