పిఎంఇండియా
ప్రముఖ రచయిత, జ్ఞాని, మేధావి శ్రీ బల్బీర్ పుంజ్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
శ్రీ బల్బీర్ పుంజ్ పాత్రికేయ ప్రపంచానికి గొప్ప సేవలు అందించిన ప్రముఖ రచయిత, జ్ఞాని, మేధావి అని శ్రీ మోదీ కొనియాడారు. ఆయన రచనలు విస్తృత ప్రాచుర్యాన్ని పొందాయని, జాతీయ పునరుజ్జీవనం దిశగా ఆయనకున్న అభిరుచిని ప్రతిబింబిస్తాయన్నారు. పార్లమెంటులో శ్రీ పుంజ్ ప్రసంగాలు వాస్తవాలతో, సిద్ధాంతంతో కూడుకొని ఉండేవన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘శ్రీ బల్బీర్ పుంజ్ ప్రముఖ రచయిత, జ్ఞాని, మేధావి. పాత్రికేయ ప్రపంచానికి గొప్ప సేవలను అందించారు. ఆయన రచనలు విస్తృత ప్రాచుర్యాన్ని పొందాయి. జాతీయ పునరుజ్జీవనం పట్ల ఆయనకున్న బలమైన అభిరుచిని ప్రతిబింబిస్తాయి. పార్లమెంటులో ఆయన ప్రసంగాలు వాస్తవాలు, సిద్ధాంతంతో కూడుకొని ఉండేవి.
ప్రధానంగా విద్యార్థులు, నిపుణులు, విద్యావేత్తలు, మేధావుల్లో బీజేపీని బలోపేతం చేయడానికి శ్రీ బల్బీర్ పుంజ్ అవిశ్రాంతంగా కృషి చేశారు. గుజరాత్‌తో సహా వివిధ రాష్ట్రాలకు ఆయన ఇన్‌ఛార్జిగా పనిచేశారు. ఆనాటి మా చర్చలను ఆత్మీయంగా స్మరించుకుంటున్నాను. ఆయన మరణం దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన కుటుంబానికి, స్నేహితులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’’
***
Shri Balbir Punj Ji was a prolific writer, thinker and public intellectual. He made a rich contribution to the world of media. His writings were widely read, reflecting his strong passion towards national regeneration. His Parliamentary interventions were rich in facts and… pic.twitter.com/ZVsZ9Np8Iv
— Narendra Modi (@narendramodi) April 18, 2026
बलबीर पुंज जी एक प्रसिद्ध लेखक होने के साथ-साथ प्रखर विचारक और सम्मानित बुद्धिजीवी थे। मीडिया के क्षेत्र में उनका योगदान बहुत सराहनीय रहा है। लोग उनकी लेखनी के कायल थे, जिससे राष्ट्र निर्माण के प्रति उनकी गहरी प्रतिबद्धता परिलक्षित होती थी । उनके संसदीय भाषणों में तथ्यों और… pic.twitter.com/SOirA8gDJe
— Narendra Modi (@narendramodi) April 18, 2026