Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాని శ్రీ మోదీతో ర‌ష్యా ఉప ప్ర‌ధాని శ్రీ దిమిత్రి రొగోజిన్ భేటీ


ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోదీతో ర‌ష్యా ఉప ప్ర‌ధాని శ్రీ దిమిత్రి రొగోజిన్ ఈ రోజు మ‌ధ్యాహ్నం భేటీ అయ్యారు. శ్రీ దిమిత్రి రొగోజిన్‌కు ఈ ఏడాది భార‌త‌దేశంలో ఇది మూడో ప‌ర్య‌ట‌న‌. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని శ్రీ మోదీ ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు. ఈ ఏడాది ఇరు దేశాల మ‌ధ్య‌న గ‌ణ‌నీయ‌మైన స్థాయిలో జ‌రిగిన ఉన్న‌త స్థాయి సంప్ర‌దింపుల పట్ల ప్ర‌ధాని శ్రీ మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూన్ నెల‌లో జ‌రిగిన వార్షిక‌ ద్వైపాక్షిక స‌మావేశం సంద‌ర్భంగా తాను పీట‌ర్స్‌బ‌ర్గ్ ను సంద‌ర్శించిన విష‌యాన్ని ప్ర‌ధాని గుర్తు చేశారు.

ద్వైపాక్షిక సంబంధాల్లో పెరుగుతున్న వైవిధ్య‌త‌, స్థిరంగా కొన‌సాగుతున్న విస్త‌ర‌ణ అంశాల‌పైన ప్ర‌ధాని శ్రీ మోదీ, ర‌ష్యా ఉప‌ప్ర‌ధాని దిమిత్రి చ‌ర్చ‌లు చేశారు. ఇంధ‌న రంగంలో ఇరు దేశాల మ‌ధ్య‌న ప్ర‌ధానంగా క‌నిపిస్తోన్న స‌హ‌కారం, ఇరు దేశాలు ఉమ్మ‌డిగా కొన‌సాగిస్తోన్న ఉన్న‌త‌స్థాయి స‌హ‌కారంపైన ఈ చ‌ర్చ‌లు కొన‌సాగాయి.

ర‌ష్యా అధ్య‌క్షుడు శ్రీ పుతిన్ త‌ర‌ఫున ఉప ప్ర‌ధాని శ్రీ దిమిత్రి రొగోజిన్ ప్ర‌ధాని శ్రీ మోదీకి శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌ధాని కూడా త‌న హృద‌యపూర్వ‌క శుభాభినంద‌న‌ల్ని శ్రీ పుతిన్‌కు తెలియ‌జేశారు.

*****