Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి తో డ‌బ్ల్యుటిఒ డిజి భేటీ


డ‌బ్ల్యుటిఒ మంత్రుల లాంఛనప్రాయ స‌మావేశానికి హాజ‌రు కావ‌డం కోసం న్యూ ఢిల్లీ కి విచ్చేసిన డ‌బ్ల్యుటిఒ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ (డిజి) శ్రీ రాబర్టో ఎజెవెడో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో ఈ రోజు సమావేశమయ్యారు.

బ‌హుళ పక్ష వ్యాపార వ్య‌వ‌స్థ కు మరింత బలాన్ని ఇచ్చే మార్గాల‌ను అన్వేషించ‌డం కోసం సంభాషణను మొద‌లు పెట్టే చొర‌వను తీసుకొన్నందుకుగాను భార‌త ప్ర‌భుత్వానికి డిజి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

బ‌హుళ పక్ష వ్యాపార వ్య‌వ‌స్థ కు భార‌త‌దేశం ఒక బ‌ల‌మైన మ‌ద్ద‌తుదారు అని ప్ర‌ధాన మంత్రి పున‌రుద్ఘాటించారు. డ‌బ్ల్యుటిఒ యొక్క కార్య‌క్ర‌మాల‌కు ప్రాధాన్య క్ర‌మాన్ని ఇవ్వ‌డం త‌ప్ప‌నిస‌రి అని, తద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల ఆందోళ‌న‌ల‌ను అది పరిష్కరించగలుగుతుందని ఆయ‌న పేర్కొన్నారు. స్వేచ్ఛా వ్యాపారం మ‌రియు ప్ర‌పంచీక‌ర‌ణ యొక్క లాభాలు అభివృద్ధి చెందుతున్న దేశాల‌లో మ‌రింత స్ప‌ష్ట‌ంగా అగుపడేటట్టు ప్ర‌త్యేక కృషి చేయ‌వ‌ల‌సిందిగా డ‌బ్ల్యుటిఒ డిజి కి ప్ర‌ధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. డ‌బ్ల్యుటిఒ మంత్రుల లాంఛనప్రాయ స‌మావేశం స‌ఫ‌లం కావాల‌ంటూ ప్రధాన మంత్రి తన శుభాకాంక్షలను వ్యక్తం చేశారు.

****