Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి తో ”సత్యభామ-శాట్” ఉపగ్రహాన్ని నిర్మించిన విద్యార్థుల బృందం

ప్ర‌ధాన మంత్రి తో ”సత్యభామ-శాట్” ఉపగ్రహాన్ని నిర్మించిన విద్యార్థుల బృందం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ని ”సత్యభామ-శాట్” ఉపగ్రహాన్ని నిర్మించిన విద్యార్థుల బృందం ఈ రోజు న్యూ ఢిల్లీ లో కలుసుకొంది. సత్యభామ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్స్ లర్ డాక్టర్ బి. శీలా రాణి కూడా ఈ విద్యార్థుల వెంట ఉన్నారు.

గ్రీన్ హౌస్ గ్యాసెస్ కు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ఒక ఉపగ్రహాన్ని నిర్మించేందుకు విద్యార్థుల బృందం చేసిన ప్రయత్నాలను ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు.

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐ ఎస్ ఆర్ ఒ – ఇస్రో) 2016 సంవత్సరం జూన్ 22న పి ఎస్ ఎల్ వి- సి34 వాహక నౌకను ఉపయోగించి ప్రయోగించిన ఇరవై ఉపగ్రహాలలో ”సత్యభామ-శాట్” కూడా ఉంది.