Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి లద్దాఖ్ లోని లేహ్ లో ఉన్న మహాబోధి ఇంటర్ నేషనల్ మెడిటేషన్ సెంటర్ కు ‘మహాకరుణ దివస్ 2017’ ఉత్సవాల సందర్భంగా అభినందనలు తెలిపారు


లద్దాఖ్ లోని లేహ్ లో ఉన్న మహాబోధి ఇంటర్ నేషనల్ మెడిటేషన్ సెంటర్ కు ‘మహాకరుణ దివస్ 2017’ ఉత్సవాలను పురస్కరించుకొని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.

“ లద్దాఖ్ లోని లేహ్ లో ఉన్న మహాబోధి ఇంటర్ నేషనల్ మెడిటేషన్ సెంటర్ కు ‘మహాకరుణ దివస్ 2017’ ఉత్సవాల సందర్భంగా ఇవే నా అభినందనలూ, శుభాకాంక్షలూను.

సేవ, దయాళుత్వం, త్యాగాలు బుద్ధ భగవానుని జీవితంలో, ఆయన బోధనలలో నిండిపోయాయి. అహింసను గురించి, మానవుల దు:ఖాన్ని అంతం చేయడాన్ని గురించి మనసు కు హత్తుకొనేట్లు ఆయన చెప్పారు ” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.