Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప‌బ్లిక్ సెల‌క్ష‌న్ బోర్డ్ (పిఇఎస్ బి) కు సంబంధించిన 1987 మార్చి 3నాటి తీర్మానాల‌కు స‌వ‌ర‌ణ చేయాల‌ని చేసిన ప్ర‌తిపాద‌న‌కు కేంద్ర మంత్రి మండ‌లి ఆమోదం.


ప‌బ్లిక్ సెల‌క్ష‌న్ బోర్డ్ (పిఇఎస్ బి) కు సంబంధించిన 1987 మార్చి 3నాటి తీర్మానాల‌కు స‌వ‌ర‌ణ చేయాల‌ని చేసిన ప్ర‌తిపాద‌న‌కు ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రి మండ‌లి ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ప్ర‌తిపాదిత స‌వ‌ర‌ణ‌లు ఇలా ఉన్నాయి..

ఎ. స్టేట్ ప‌బ్లిక్ ఎంట‌ర్ ప్రైజెస్‌, ప్రైవేట్ సెక్ట‌ర్ల‌నుంచి ఎంపిక చేసే అభ్య‌ర్థులను సెంట్ర‌ల్ ప‌బ్లిక్ సెక్ట‌ర్ ఎంట‌ర్ ప్రైజెస్ లలో అపాయింట్ చేసిన‌ప్పుడు ఐదు సంవ‌త్స‌రాల‌పాటు అంత‌ర్గేత‌ర అభ్యర్థులు ( నాన్ ఇంట‌ర్న‌ల్‌) గా ప‌రిగ‌ణిస్తారు.
బి. ప‌బ్లిక్ ఎంట‌ర్ ప్రైజెస్ సెలెక్ష‌న్ బోర్డు చైర్ ప‌ర్స‌న్‌, స‌భ్యుల కాల ప‌రిమితి 3 సంవ‌త్స‌రాలు. ఇది విధులు చేప‌ట్టిన‌నాటినుంచి లెక్క‌లోకి వ‌స్తుంది. లేదా వారు విధులు చేప‌ట్టిన‌నాటినుంచి 65 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ముందే వ‌స్తే ఆ లోపువ‌ర‌కే విధుల‌ను నిర్వ‌హించాలి. లేదా దీనికి సంబంధించిన ఆదేశాలు వ‌చ్చేంత‌వ‌రకు కూడా వారు విధులు నిర్వ‌హించ‌వ‌చ్చు. ఈ మూడు నిబంధ‌న‌ల్లో ఏది ముందు సంభ‌విస్తే దాన్నే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు.

నేప‌థ్యం

సెంట్ర‌ల్ ప‌బ్లిక్ సెక్ట‌ర్ ఎంట‌ర్ ప్రైజెస్ ల‌లో సీనియ‌ర్ ఉద్యోగుల సంఖ్య‌ను పెంచ‌డంకోసం స్టేట్ ప‌బ్లిక్ సెక్ట‌ర్ ఎంట‌ర్ ప్రైజెస్ ల‌నుంచి అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసుకునే విధానాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది. ఈ అభ్య‌ర్థుల‌ను మ‌రో ఐదు సంవ‌త్స‌రాల‌పాటు కూడా సిపిఎస్ ఇ ల‌లో కొన‌సాగించాల‌ని ప్ర‌తిపాదించ‌డం జ‌రిగింది. ఈ ప్ర‌తిపాద‌న‌తోపాటు పబ్లిక్ ఎంట‌ర్ ప్రైజెస్ సెలెక్ష‌న్ బోర్డు విధుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించ‌డానికి వీలుగా ఇత‌ర అవ‌స‌ర‌మైన మార్పుల‌ను కూడా ప్ర‌తిపాదించ‌డం జ‌రిగింది.
ఈ స‌వ‌ర‌ణ‌ల కార‌ణంగా స్టేట్ ప‌బ్లిక్ సెక్ట‌ర్ ఎంట‌ర్ ప్రైజులు, ప్రైవేట్ సెక్ట‌ర్ల‌నుంచి స‌మ‌ర్థులైన నిపుణుల‌ను సిపి ఎస్ ఇ ల‌లో సీనియ‌ర్ పోస్టుల‌కోసం ఎంపిక చేసుకోవ‌డం జ‌రుగుతుంది.

ఎస్‌పి ఎస్ ఇల‌నుంచి, ప్రైవేట్ రంగాన్నుంచి వ‌చ్చే అభ్య‌ర్థుల నైపుణ్యాల‌నుంచి, ఆయా రంగాల్లో వారికున్న నిపుణ‌త్వాన్నుంచి సిపిఎస్ ఇ లు ల‌బ్ధి పొంద‌డం జ‌రుగుతుంది. అంత‌ర్గ‌త‌, అంత‌ర్గ‌తేత‌ర దృక్ప‌థం కార‌ణంగా సిసిఎస్ ఇ కి సంబంధించిన సీనియ‌ర్ మేనేజ్ మెంట్ ల‌బ్ధి పొందుతుంది.