పిఎంఇండియా
పశ్చిమ బంగాల్ లోని నోవాపాడా నుంచి దక్షిణేశ్వర్ వరకు విస్తరించిన మెట్రో రైల్వే మార్గాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు ప్రారంభించడం తో పాటు ఆ మార్గం లో మొదటి మెట్రో సర్వీసు కు ప్రారంభ సూచకం గా పచ్చజెండా ను కూడా చూపించారు. కలాయీకుండా, ఝార్గ్రామ్ ల మధ్య మూడో మార్గాన్ని కూడా ఆయన ప్రారంభించారు.
ఈస్టర్న్ రైల్వే లో అజీమ్ గంజ్ నుంచి ఖర్గాఘాట్ రోడ్ సెక్షన్ వరకు వేసిన జోడు రైలు పట్టాల ను సైతం దేశ ప్రజల కు శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేశారు. దన్‌కునీ కి, బరూయీపారా కు మధ్య నాలుగో లైను ను, రసూల్ పుర్ కు, మగ్ రా కు మధ్య మూడో రైలు ను కూడా దేశ ప్రజల కు ఆయన అంకితం చేశారు.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రజల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజు న ప్రారంభించిన పథకాలు హుగ్ లీ చుట్టుపక్కల ప్రాంతాలలో నివసిస్తున్న లక్షల కొద్దీ ప్రజల జీవనాన్ని సరళతరం చేస్తాయన్నారు. రవాణా కు ఉపయోగపడే సాధనాలు మెరుగైన కొద్దీ మన దేశం లో స్వయంసమృద్ధి, విశ్వాసం తాలూకు సంకల్పాలు దృఢతరం కాగలవన్నారు. కోల్‌కాతా తో పాటు హుగ్ లీ, హావ్ డా, నార్త్ 24 పరగణాస్ జిల్లా ల ప్రజలు కూడా మెట్రో సర్వీసు ప్రయోజనాల ను అందుకొంటారని ఆయన చెప్తూ, ఈ విషయమై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. నోవాపాడా నుంచి దక్షిణేశ్వర్ కు విస్తరించిన మెట్రో రైల్వే ను ప్రారంభించుకోవడం తో, ఈ రెండు ప్రదేశాల మధ్య ప్రయాణ కాలం 90 నిమిషాల నుంచి 25 నిమిషాల కు తగ్గిపోతుందని ఆయన చెప్పారు. ఈ సర్వీసులు విద్యార్థుల కు, శ్రామికుల కు ఎంతగానో ఉపయోగకరం కాగలవన్నారు.
భారతదేశం లో మెట్రో లేదా రైల్వే వ్యవస్థ ల నిర్మాణం లో ఈ మధ్య కాలం లో ‘మేడ్ ఇన్ ఇండియా’ తాలూకు ప్రభావం కనిపిస్తోంది అంటూ ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. పట్టాల ను వేయడం మొదలుకొని, ఆధునిక రైలు బండ్ల వరకు, అలాగే ఆధునిక రైళ్ళు మొదలుకొని ఆధునిక రైలు పెట్టెలు, గూడ్స్ తో పాటు భారీ ఎత్తున వినియోగిస్తున్న సాంకేతికత సైతం దేశీయం గానే తయారవుతోందన్నారు. ఇది ప్రాజెక్టు అమలు ను వేగవంతం చేసిందని, నిర్మాణం లో నాణ్యత ను పెంచిందని ఆయన వివరించారు.
దేశం లో స్వయంసమృద్ధి తాలూకు ఒక ముఖ్యమైన కేంద్రం గా పశ్చిమ బంగాల్ ఉంటూ వచ్చిందని, పశ్చిమ బంగాల్ కు, దేశ ఈశాన్య ప్రాంతాని కి అంతర్జాతీయ వ్యాపారం తాలూకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కొత్త రైలు మార్గాలు మనిషి జీవనాన్ని సరళతరం గా మార్చుతాయని, పరిశ్రమల కు కూడా కొత్త మార్గాలు అందుబాటు లోకి వస్తాయని ప్రధాన మంత్రి వివరించారు.
***
हमारे देश में ट्रांसपोर्ट के माध्यम जितने बेहतर होंगे, आत्मनिर्भरता और आत्मविश्वास का हमारा संकल्प उतना ही सशक्त होगा।
— PMO India (@PMOIndia) February 22, 2021
मुझे खुशी है कि कोलकाता के अलावा हुगली, हावड़ा और उत्तरी 24 परगना जिले के साथियों को भी अब मेट्रो सेवा की सुविधा का लाभ मिल रहा है: PM #BanglarBikasheRail
मुझे खुशी है कि मेट्रो हो या रेलवे सिस्टम, आज भारत में जो भी निर्माण हो रहा है, उसमें मेड इन इंडिया की छाप स्पष्ट दिख रही है।
— PMO India (@PMOIndia) February 22, 2021
ट्रैक बिछाने से लेकर रेलगाड़ियों के आधुनिक इंजन और आधुनिक डिब्बों तक बड़ी मात्रा में उपयोग होने वाला सामान और टेक्नॉलॉजी अब भारत की अपनी ही है: PM
पश्चिम बंगाल, देश की आत्मनिर्भरता का एक अहम केंद्र रहा है और यहां से नॉर्थ ईस्ट से लेकर, हमारे पड़ोसी देशों के साथ व्यापार-कारोबार की असीम संभावनाएं हैं।
— PMO India (@PMOIndia) February 22, 2021
इसी को देखते हुए बीते सालों में यहां के रेल नेटवर्क को सशक्त करने का गंभीरता से प्रयास किया जा रहा है: PM #BanglarBikasheRail
इन नई रेल लाइनों से जीवन तो आसान होगा ही, उद्यम के लिए भी नए विकल्प मिलेंगे।
— PMO India (@PMOIndia) February 22, 2021
यही तो बेहतर इंफ्रास्ट्रक्चर का लक्ष्य होता है।
यही तो सबका साथ, सबका विकास, सबका विश्वास है।
यही तो आत्मनिर्भर भारत का भी अंतिम लक्ष्य है: PM @narendramodi #BanglarBikasheRail