పిఎంఇండియా
భారత్‌లో అధికార పర్యటనకు వచ్చిన ఫిన్లాండ్ అధ్యక్షుడు శ్రీ అలెగ్జాండర్ స్టబ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్వాగతం పలికారు.
ఆయన పర్యటన భారత్, ఫిన్లాండుల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందన్న నమ్మకాన్ని శ్రీ మోదీ వ్యక్తం చేశారు.
అంతకు ముందు అధ్యక్షుడు శ్రీ స్టబ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, తాను భారత్‌లో అధికార పర్యటనకు తరలివెళ్తున్నట్లు తెలిపారు. భారత్‌లో రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రితో తాను భేటీ కానున్నట్లు, ఇతర ప్రముఖ నేతలను కూడా తాను కలుసుకోనున్నట్లు ఆయన వివరించారు. ఈ పర్యటన ఫిన్లాండ్, భారత్‌ల మధ్య వాణిజ్యం సహా సంబంధాలను మరింత పటిష్ఠపరచగలదని శ్రీ స్టబ్ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఫిన్లాండ్ అధ్యక్షుడు పొందుపరిచిన సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ –
‘‘అధ్యక్షుడు శ్రీ అలెగ్జాండర్ స్టబ్‌కు భారత్‌లోకి ఇదే స్వాగతం పలుకుతున్నాను. మీ పర్యటన భారత్-ఫిన్లాండ్ సంబంధాల్ని సరికొత్త స్థాయులకు తీసుకుపోతుందన్న మీ మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. రేపటి మన సమావేశం కోసం, అలాగే రైసినా చర్చ- 2026 కార్యక్రమంలో మీ కీలకోపన్యాసం కోసం నేను చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నాను.
@alexstubb” అని పేర్కొన్నారు.
Welcome to India, President Alexander Stubb. I fully agree with you, your visit will take India-Finland relations to new heights. I eagerly look forward to our meeting tomorrow and to your keynote address at the Raisina Dialogue 2026. @alexstubb https://t.co/pJs0N3J9Mr
— Narendra Modi (@narendramodi) March 4, 2026