Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫిబ్రవరి 19న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026ను ప్రారంభించనున్న ప్రధాని


న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో 2026 ఫిబ్రవరి 19న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారుదీనికి ముందుగా ఫిబ్రవరి 18 సాయంత్రం గం.లకు వివిధ దేశాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసే వివిధ దేశాల నాయకులకు స్వాగతం పలుకుతారుఅలాగే.. సదస్సుకు హాజరైన అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 19ఉదయం 9.40 గం.లకు ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారుప్రధానితో పాటుగాఫ్రాన్స్ అధ్యక్షుడుఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిఇతర అంతర్జాతీయ పారిశ్రామిక ప్రముఖులు ప్రసంగిస్తారు.

ఉదయం 11 గంటలకు ఇతర నాయకులతో కలసి ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో-2026లో ఏర్పాటు చేసిన వివిధ దేశాల పెవిలియన్లను సందర్శిస్తారు.

మధ్యాహ్నం 12 గం.ల నుంచి జరిగే లీడర్స్ ప్లీనరీలో ప్రధానమంత్రి పాల్గొంటారుఈ కార్యక్రమంలో పరిపాలనమౌలిక వసతులుఅంతర్జాతీయ సహకారంతో సహా ఏఐకు సంబంధించి జాతీయఅంతర్జాతీయ ప్రాధాన్యాలపై దేశాధిపతులుమంత్రులుబహుపాక్షిక సంస్థలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధులు చర్చిస్తారు.

సాయంత్రం 5.30 గం.లకు జరిగే సీఈవో రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారుప్రభుత్వ నాయకత్వంలో అంతర్జాతీయ సాంకేతికపారిశ్రామిక సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు దీనిలో పాల్గొంటారుపెట్టుబడులుపరిశోధనా సహకారంసరఫరా వ్యవస్థలుఏఐ వ్యవస్థల అమలుపై వారు చర్చిస్తారు.

సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అనే ఇతివృత్తంతో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 జరుగుతుందిఅంటే అందరికీ సంక్షేమంఅందరికీ ఆనందం అని అర్థంఏఐ రంగంలో భారత్‌ను అగ్రస్థానానికి చేర్చడంమానవత్వాన్నిసమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించేమన గ్రహాన్ని రక్షించే ఏఐ భవిష్యత్తును తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

ప్రజలుపృథ్విప్రగతి అనే మూడు ప్రధానాంశాలకు అనుగుణంగా ఏడు వర్కింగు గ్రూపులు ఈ సదస్సును ముందుకు నడిపిస్తాయివివిధ రంగాల్లో ఏఐ ప్రభావాన్ని తెలిజేసేలా నిర్ధిష్ట ఫలితాలను అందించడంపై ఈ బృందాలు పనిచేస్తాయిఏడు అంశాలుఆర్థిక ప్రగతిసామాజిక ప్రయోజనం కోసం ఏఐఏఐ వనరుల ప్రజాస్వామ్యీకరణసామాజిక సాధికారతకు సమ్మిళిత్వంసురక్షితమైనవిశ్వసనీయమైన ఏఐమానవ మూలధనంసైన్సుస్థిరత్వంఆవిష్కరణసామర్థ్యం.

ఈ సదస్సులో సీఈవోలు/సీఎక్స్‌వోలతో సహా 500 మందికి పైగా అంతర్జాతీయ ఏఐ నిపుణులుసుమారుగా 100 మంది సీఈవోలువ్యవస్థాపకులు, 150 మంది విద్యావేత్తలుపరిశోధకులు, 400 మంది సీటీవోలువీపీలుదాతలు పాల్గొంటారుఅలాగే 20కి పైగా దేశాలప్రభుత్వాల అధినేతలు, 60 మంది మంత్రులుఉప మంత్రులతో సహా100 మందికి పైగా ప్రభుత్వ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

 

***