Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బిమ్స్‌టెక్ గ్రిడ్ ఇంట‌ర్‌క‌నెక్ష‌న్ ఏర్పాటుకోసం ఆమోద‌ప‌త్రం, సంత‌కాలపై అవ‌గాహ‌నా ఒప్పందానికి కేంద్ర మంత్రివ‌ర్గ ఆమోదం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేతృత్వంలో స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్‌.. విద్యుత్ శాఖ ప్ర‌తిపాద‌న అయిన బిమ్స్‌టెక్ గ్రిడ్ ఇంట‌ర్ క‌నెక్ష‌న్ ఏర్పాటుకోసం అవ‌స‌ర‌మైన అవ‌గాహ‌నా ఒప్పందంపై సంత‌కం చేసేందుకు ఆమోదం తెలిపింది. దీనిపై బిమ్స్‌టెక్ స‌భ్య‌దేశాలు త్వ‌ర‌లో నేపాల్‌లో జ‌రిగే మూడ‌వ బిమ్స్‌టెక్ విద్యుత్‌శాఖ మంత్రుల స‌మావేశంలో వీటిపై సంత‌కం చేయాల్సి ఉంటుంది.

పూర్వ‌రంగం

ద‌క్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలైన బంగ్లాదేశ్‌, భార‌త్‌, మ‌య‌న్మార్‌, శ్రీలంక‌, థాయ్‌లాండ్‌, భూటాన్‌, నేపాల్ త‌దిత‌ర దేశాల‌ను క‌ల‌పుకుంటూ ఏర్పాటు చేసిన అంత‌ర్జాతీయ సంస్థ ‘ద బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫ‌ర్ మ‌ల్టి-సెక్టోర‌ల్ టెక్నిక‌ల్ అండ్ ఎక‌న‌మిక్ కోఆప‌రేష‌న్ (బీఐఎమ్ఎస్‌టీఈసీ-బిమ్స్‌టెక్‌)’. 2005 అక్టోబ‌ర్ 4న ఢిల్లీలో జ‌రిగిన తొలి బిమ్స్‌టెక్ విద్యుత్ మంత్రుల స‌మావేశంలోనే ‘బిమ్స్‌టెక్ దేశాల మ‌ధ్య విద్యుత్ స‌హ‌కారం కోసం కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌’ను రూపొందించారు. దీని ప్ర‌కారం బిమ్స్‌టెక్ దేశాల మ‌ధ్య విద్యుత్ మార్పిడి, అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా థాయ్‌లాండ్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేయ‌నున్నారు. సంస్థ‌లోని స‌భ్య‌దేశాల ప్ర‌తినిధులు గ్రిడ్ ఇంట‌ర్‌క‌నెక్ష‌న్‌కు సంబంధించిన ముసాయిదా అవ‌గాహ‌నా ఒప్పందంపై నివేదిక ఇస్తారు. ఇప్పటివ‌ర‌కు బిమ్స్‌టెక్‌లో విద్యుత్ మార్పిడికి సంబంధించి ఐదుసార్లు స‌మావేశాలు జ‌రిగాయి. బిమ్స్‌టెక్ గ్రిడ్ ఇంట‌ర్‌క‌నెక్ష‌న్ ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా అవ‌గాహ‌నా ఒప్పందానికి 2015 మార్చి16న టాస్క్‌ఫోర్స్ తుదిరూపు ఇచ్చింది.
2016లో అక్టోబ‌ర్ 16న గోవాలో బిమ్స్‌టెక్ నేత‌ల రిట్రీట్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. బిమ్స్‌టెక్ గ్రిడ్ ఇంట‌ర్‌క‌నెక్ష‌న్ పై అవ‌గాహ‌నా ఒప్పందంపై సంత‌కాల‌ను వేగ‌వంతం చేయాల‌ని ఈ స‌మావేశంలో నేత‌లు నిర్ణ‌యించారు. చివ‌ర‌కు 2017 జ‌న‌వ‌రి 11,12న జ‌రిగిన బిమ్స్‌టెక్ సీనియ‌ర్ అధికారుల 4వ స‌మావేశంలో అవ‌గాహ‌నా ఒప్పందంపై చ‌ర్చించి తుదిరూపునిచ్చారు.

ప్ర‌భావం

ఈ ఒప్పందం వ‌ల్ల బిమ్స్‌టెక్ ప్రాంతంలో హేతుబ‌ద్ధ‌మైన‌, నాణ్య‌మైన విద్యుత్ ప్ర‌సారాన్నిప్రోత్స‌హించే ఉద్దేశంతో విద్యుత్ వ్యాపారం జ‌రిగేలా గ్రిడ్ ఇంట‌ర్‌క‌నెక్ష‌న్స్ అమ‌లులో స‌హ‌కారం కోసం స‌భ్య‌దేశాల మ‌ధ్య స‌హ‌కారానికి సంబంధించిన విస్తృత‌మైన ఫ్రేమ్‌వ‌ర్క్ నిర్మాణ‌మ‌వుతుంది. ఈ అవ‌గాహ‌న ఒప్పందం వ‌ల్ల క‌లిగే లాభాలు:

1. ఈ ప్రాంతంలో శ‌క్తి వ‌న‌రుల అనుకూల వినియోగం ద్వారా స‌భ్య‌దేశాల్లోని చ‌ట్టాలు, నియ‌మ నిబంధ‌న‌ల విష‌యంలో వివ‌క్ష లేకుండా ప‌ర‌స్ప‌ర లాభం చేకూరుతుంది.

2.ప్రాంతీయ విద్యుత్ నెట్‌వ‌ర్క్ అభివృద్ధి వ‌ల్ల నాణ్య‌మైన, ఆర్థిక‌ప‌ర‌మైన‌, భ‌ద్ర‌త‌తో కూడిన విద్యుత్ వ్య‌వ‌స్థ కార్యాచ‌ర‌ణకు ప్రోత్సాహ‌కంగా ఉంటుంది.

3. విద్యుదుత్ప‌త్తి సామ‌ర్థ్యం కోసం మూల‌ధ‌న పెట్టుబ‌డికి అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది.

4. స‌రిహ‌ద్దు ఇంట‌ర్‌క‌నెక్ష‌న్ల ద్వారా విద్యుత్ మార్పిడి.

****