పిఎంఇండియా
బీహార్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం స్వీకరించిన శ్రీ సమ్రాట్ చౌధరిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
శ్రీ సమ్రాట్ చౌధరి శక్తి, ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న అంకితభావంతో పాటు క్షేత్రస్థాయి అనుభవం రాష్ట్రానికి అత్యంత ప్రయోజనాన్ని అందిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. శ్రీ చౌధరి సమర్థ నాయకత్వంలో బీహార్ రాష్ట్రం, ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ, సర్వతోముఖ అభివృద్ధిలో సరికొత్త శిఖర స్థాయులకు చేరుకోగలదన్న విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.
బీహార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం స్వీకరించిన శ్రీ విజయ్ కుమార్ చౌధరికి, శ్రీ బిజేంద్ర ప్రసాద్ యాదవ్‌కి కూడా ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు.
వారి క్షేత్రస్థాయి అనుభవం, ప్రజా సంక్షేమం పట్ల వారికి ఉన్న నిబద్ధత బీహార్ అభివృద్ధికి ఒక కొత్త దిశను, జోరును అందిస్తాయన్న నమ్మకాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. సుపరిపాలనలో, పారదర్శకతలో, ప్రజాసంక్షేమంలో బీహార్ నూతన ప్రమాణాలను నెలకొల్పుతుందని కూడా ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని రెండు సందేశాలను పొందుపరుస్తూ:
‘‘బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించిన సందర్భంగా సమ్రాట్ చౌధరి గారికి అనేకానేక అభినందనలతో పాటు శుభాకాంక్షలు. ఆయన శక్తి, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకిత భావం, క్షేత్రస్థాయి అనుభవం రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా రుజువు కానున్నాయి. ఆయన సమర్థ నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని, బీహార్ అన్ని రంగాల్లో అభివృద్ధి పరంగా కొత్త శిఖరాలను అందుకోగలదని నాకు పూర్తి నమ్మకం ఉంది.’’
‘‘బీహార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం స్వీకరించిన విజయ్ కుమార్ చౌధరి గారికి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి క్షేత్ర స్థాయి అనుభవం, ప్రజల మేలు కోరి పనిచేయాలన్న నిబద్ధత బీహార్ అభివృద్ధికి ఒక కొత్త దిశను, వేగాన్ని అందిస్తాయని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అంతేకాదు, బీహార్‌లో సుపరిపాలన, పారదర్శకతతో పాటు ప్రజాసంక్షేమం ప్రతి నిత్యం సరికొత్త ప్రమాణాలు నెలకొంటాయి’’ అని పేర్కొన్నారు.
***
बिहार के मुख्यमंत्री के रूप में शपथ लेने पर सम्राट चौधरी जी को बहुत-बहुत बधाई और ढेरों शुभकामनाएं! उनकी ऊर्जा, जनसेवा के प्रति समर्पण और जमीनी अनुभव राज्य के लिए बेहद उपयोगी साबित होने वाला है। मुझे पूर्ण विश्वास है कि उनके कुशल नेतृत्व में जनता-जनार्दन की आकांक्षाओं को पूरा करते…
— Narendra Modi (@narendramodi) April 15, 2026
बिहार के उप मुख्यमंत्री के रूप में शपथ लेने वाले विजय कुमार चौधरी जी और बिजेंद्र प्रसाद यादव जी को हार्दिक बधाई और शुभकामनाएं! मुझे पूरा भरोसा है कि इनका जमीनी अनुभव और जनहित को लेकर प्रतिबद्धता बिहार के विकास को नई दिशा और गति देगी। इसके साथ ही राज्य सुशासन, पारदर्शिता और…
— Narendra Modi (@narendramodi) April 15, 2026