పిఎంఇండియా
గత పదకొండేళ్లలో భారతీయ జౌళి పరిశ్రమ సాధించిన చరిత్రాత్మక మార్పులను తెలియజెప్పే కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. ఈ పరిశ్రమ సాధించిన అపూర్వమైన ప్రగతిని, ఆధునికీకరణను, సమగ్రతను ఇది తెలియజేస్తుంది.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ చేసిన పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ:
‘‘గడచిన 11 ఏళ్లలో భారతీయ జౌళి పరిశ్రమ చరిత్రాత్మక మార్పులను సాధించింది. వీటిలో బలోపేతమైన మౌలిక వసతులు, విస్తరించిన మార్కెట్లు, మెరుగైన నైపుణ్యాలు, విస్తృతమైన ఏకీకరణ, మరెన్నో ఉన్నాయి. ఉద్యోగ కల్పన, మహిళా సాధికారత, అంతర్జాతీయ పోటీతత్వాన్ని ఈ వ్యవస్థ ప్రోత్సహిస్తోంది!
ఆ మార్పును శ్రీ గిరిరాజ్ సింగ్ @girirajsinghbjp రాసిన ఈ కథనం వివరిస్తుంది. కచ్చితంగా చదవండి!’’
Over the past 11 years, India’s textile ecosystem has witnessed historic change: stronger infrastructure, expanded markets, enhanced skilling, wider inclusion and much more. A value chain that now fuels job creation, women’s empowerment and global competitiveness!
— PMO India (@PMOIndia) December 12, 2025
This piece by… https://t.co/SoLMy2vU0h