పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్.. ఇటీవల భారత్-బంగ్లా దేశాలు కుదుర్చుకున్న పలు ఒప్పందాలకు ఆమోదం తెలిపింది. (i) 23.10.2010న కుదుర్చుకున్నసంతకాలు చేసుకున్న సరిహద్దు గ్రామాల్లో వారాంతపు సంతల ఏర్పాటు. (ii) 15.05.2012న కుదుర్చుకున్న ఒప్పందంపై సంతకం; (iii) సరిహద్దులో సరైన ప్రాంతాలను గుర్తించి బంగ్లాదేశ్ ప్రభుత్వంతోపాటు.. భారతదేశంలోని (సరిహద్దు రాష్ట్రాలు) ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి అక్కడ కొత్త సంతల ఏర్పాటు (iv) బంగ్లాదేశ్ ప్రభుత్వంతోపాటు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలతో చర్చించి ఒప్పందంలో మార్పులు, చేర్పులు చేపట్టడం.
ఇరు దేశాల్లో సరిహద్దు గ్రామాల ప్రజల సౌకర్యార్థం సరిహద్దు సంతల ఏర్పాటు చాలా అవసరం. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించే ఈ సంతల ద్వారా స్థానికులు తాము పండించిన వాటిని స్థానిక మార్కెట్లద్వారా అమ్ముకుని డబ్బులు సంపాదిస్తారు.
లేదా వస్తుమార్పిడి పద్ధతిలో లాభం పొందుతారు. ద్వైపాక్షిక వ్యాపారం ద్వారా పెద్దగా లాభం లేకపోయినా.. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు, వెనుకబడిన వర్గాల ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగుపడుతుంది.
పూర్వరంగం:
2010 జనవరి 10-13మధ్య అప్పటి భారత ప్రధాని.. బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా.. సరిహద్దుల్లో వారాంతపు సంతల ఏర్పాటుకు ప్రత్యేకంగా గుర్తించిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు ఒప్పందం కుదిరింది. మేఘాలయాతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆయా ప్రాంతాల్లో లభించే ఉత్పత్తులను అమ్మేందుకు.. ఇరు దేశాల మధ్య నియమ నిబంధనలు రూపకల్పనకు అంగీకారం.
దీన్ని అమలు చేసే క్రమంలో.. భారత్-బంగ్లా సరిహద్దుల్లో వారాంత సంతల నిర్వహణ పై కూడా 2010 అక్టోబర్ 23న ఒప్పందం కుదిరింది. దీనిపై 15.05.2012న సంతకాలు చేసుకున్నారు.
ఇప్పటికే అమల్లో ఉన్న సరిహద్దు వారాంతపు సంతలు:
1. కలైచర్ (మేఘాలయ-బంగ్లాదేశ్ సరిహద్దు)
2. బాలట (మేఘాలయ-బంగ్లాదేశ్ సరిహద్దు)
3. కమలాసాగర్ (త్రిపుర-బంగ్లాదేశ్ సరిహద్దు)
4. శ్రీనగర్ (త్రిపుర-బంగ్లాదేశ్ సరిహద్దు)
దీనికి తోడు.. త్రిపుర సరిహద్దుల్లో రెండు, మేఘాలయ సరిహద్దుల్లో నాలుగు వారాంతల సంతల ఏర్పాటుకు ఇరు దేశాల ప్రభుత్వాలు అంగీకరించాయి.