Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత అథ్లెట్లు, క్రీడా వ్యవస్థకు గణనీయమైన మద్దతు లభిస్తుందని స్పష్టం చేస్తున్న కథనాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


దేశవ్యాప్తంగా క్రీడాకారులకు గణనీయమైన మద్దతు లభిస్తోందంటూ షూటర్ ఎలవేనిల్ వలరివాన్ రాసిన కథనాన్ని ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

ఖేల్ మహాకుంభ్, ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువ ప్రతిభను ప్రోత్సహించటం నుంచి అత్యున్నత స్థాయి పోటీల్లో క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ, ఆధునిక వసతులు, మద్దతును అందించటం వరకు ప్రధానమంత్రి అందిస్తున్న సహకారం గురించి ఎలవేనిల్ వలరివాన్ ఈ కథనంలో వివరించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.

“భారత క్రీడా రంగంలో అథ్లెట్లకు మద్దతిచ్చే విషయంలో ఎంతో మార్పు వచ్చిందని ఎలవేనిల్ వలరివాన్ కథనంలో రాశారు. ఖేల్ మహాకుంభ్, ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువ ప్రతిభను ప్రోత్సహించటం నుంచి అత్యున్నత స్థాయి పోటీల్లో అథ్లెట్లకు ప్రపంచ స్థాయి శిక్షణ, ఆధునిక వసతులు, మద్దతును అందించటం వరకు ప్రధానమంత్రి అందిస్తున్న సహకారం గురించి వివరించారు.

తప్పకుండా చదవండి!”

***