Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత ప్రధానికి ఆర్డర్ ఆఫ్ ఒమన్ పురస్కారం

భారత ప్రధానికి ఆర్డర్ ఆఫ్ ఒమన్ పురస్కారం


భారత్ – ఒమన్ సంబంధాల బలోపేతం కోసం భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన విశేష కృషి, ఆయన దార్శనిక నాయకత్వానికి గుర్తింపుగా.. గౌరవ ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆయనకు ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారాన్ని అందించారు.

అనాదిగా ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న మైత్రికి ఆయన ఈ పురస్కారాన్ని అంకితమిచ్చారు. 140 కోట్ల మంది భారతీయులు, ఒమన్ ప్రజల మధ్య ఆప్యాయతానురాగాలకు గుర్తింపుగా దీన్ని అభివర్ణించారు.

రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తవడం, అదే సమయంలో ప్రధానమంత్రి ఒమన్‌లో పర్యటిస్తున్న సందర్భంగా ఈ పురస్కారాన్ని అందించడంతో.. ఈ కార్యక్రమం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వ్యూహాత్మక భాగస్వామ్యానికి లభించిన ప్రత్యేక గుర్తింపు ఇది.

1970లో మహారాజు సుల్తాన్ ఖాబూస్ బిన్ సయీద్ ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారాన్ని నెలకొల్పారు. ప్రజా జీవితంలో, ద్వైపాక్షిక సంబంధాల్లో విశేష సేవలందించి, పేరెన్నిక గన్న ప్రముఖ అంతర్జాతీయ నాయకులకు ఈ పురస్కారాన్ని అందించారు.

 

***