Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులను తెలియజేసే కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


భారత వ్యవసాయ రంగంలోని విప్లవాత్మక మార్పులను తెలియజేసేలా శ్రీ అశోక్ గులాటి రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. శ్రీ నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనలో గుజరాత్ వ్యవసాయం నుంచి భారతదేశ వ్యాప్తంగా వ్యవసాయాభివృద్ధి వరకు వచ్చిన మార్పులను ఈ కథనం తెలియజేస్తుంది. సాగునీరు, విద్యుత్, గ్రామాల్లో రహదారులు, సాంకేతికత, మార్కెట్ సౌలభ్యం వంటివి రైతుల ఉత్పాదకతను, ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడిన విధానాన్ని వివరిస్తుంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.

శ్రీ నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనలో గుజరాత్ వ్యవసాయం నుంచి భారతదేశ వ్యాప్తంగా వ్యవసాయాభివృద్ధి వరకు వచ్చిన మార్పులు… మెరుగైన సాగునీరు, విద్యుత్ సరఫరా, గ్రామాల్లో రహదారులు, సాంకేతికత, మార్కెట్ సౌలభ్యం వంటివి రైతుల ఉత్పాదకతను, ఆదాయాన్ని పెంచేందుకు ఎలా దోహదపడిందీ ఈ కథనం తెలియజేస్తుంది.

ఈ విధానం ద్వారా జాతీయ స్థాయిలో రైతులకు నేరుగా మద్దతు లభించటంతో పాటు వైవిధ్యమైన పంటల సాగు, మెరుగైన గ్రామీణ మౌలిక వసతుల విస్తరణ జరిగింది.

భారత వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులపై తప్పక చదవాల్సిన కథనం

https://www.business-standard.com/opinion/columns/from-gujarat-s-agrarian-miracle-to-india-s-farm-transformation-126100601522_1.html

***