Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌త్‌, స్లొవేనియాకు మ‌ధ్య రెండుసార్లు ప‌న్ను విధించే ప‌ద్ధ‌తి, ఆదాయప‌న్నుకు సంబంధించి ఎగ‌వేత‌ల నిరోధంపై ఒడంబ‌డిక‌ల ప్రాథ‌మిక ప‌త్రం స‌వ‌ర‌ణ


భార‌త్‌, స్లొవేనియాకు మ‌ధ్య రెండు సార్లు ప‌న్ను విధించే ప‌ద్ధ‌తి, ఆదాయప‌న్నుకు సంబంధించి ఎగ‌వేత‌ల నిరోధంపై ఒడంబ‌డిక‌ల ప్రాథ‌మిక ప‌త్రం (ప్రొటోకాల్‌) స‌వ‌ర‌ణకు కుదిరిన ఒక ఒప్పందానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త వ‌హించిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోద‌ ముద్ర వేసింది.

ఈ స‌వ‌ర‌ణ ప‌న్ను సంబంధిత స‌మాచారంపై ఇప్ప‌టికే నిర్దేశించుకున్న స్వ‌రూపం ప‌రిధిని మ‌రింత విస్త‌రిస్తుంది. దీంతో ఇరు దేశాల మ‌ధ్య ప‌న్ను ఎగ‌వేత‌లు, ప‌న్నుక‌ట్ట‌కుండా త‌ప్పించుకునే ధోర‌ణుల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డం సాధ్య‌ప‌డుతుంది. అంతేకాకుండా ప‌న్నుల వ‌సూళ్ళ‌లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి వీలు క‌లుగుతుంది.