Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌త్ – ఒమ‌న్ దేశాల మ‌ధ్య పౌర‌, వాణిజ్య అంశాల్లో చ‌ట్ట‌, న్యాయ‌ప‌ర‌మైన స‌హ‌కారానికి ఒప్పందం


భార‌త్‌- ఒమ‌న్‌ దేశాల మ‌ధ్య పౌర‌, వాణిజ్య అంశాల్లో స‌హ‌కారానికి సంబంధించిన ఒప్పందంపై ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయ‌, చ‌ట్ట‌పర‌మైన అంశాల్లో ఇరుదేశాల మ‌ధ్య‌ అవ‌గాహ‌న కుదిరింది.

ప్ర‌తిపాదిత ఒప్పందంలోని అంశాలు –

1. న్యాయ ఉత్త‌ర్వులు, స‌మ‌న్లు, ఇత‌రాలు.

2. చ‌ట్ట‌, న్యాయ‌ప‌ర‌మైన ప‌త్రాలు లేదా ప్ర‌క్రియ‌.

3. అభ్య‌ర్థ‌న మేర‌కు సాక్ష్యాల సేక‌ర‌ణ‌.

4. జ‌డ్జిమెంట్ల అమ‌లు, ఒప్పందాలు, మ‌ధ్య‌వ‌ర్తిత్వం.

5. ఈ ఒప్పందంలో భాగంగా పౌర, వాణిజ్య విష‌యాల్లో ఉభ‌య దేశాల మ‌ధ్య అభ్య‌ర్థ‌నా పూర్వ‌క‌మైన న్యాయ స‌హ‌కారం చేసుకోవాలి.

6. స‌మ‌న్లు, ఇత‌ర జ్యుడిషియ‌ల్ డాక్యుమెంట్ల విష‌యంలో… కోరిన స‌మాచారం స‌రిగా లేద‌న్న ప్రాతిప‌దిక తిర‌స్క‌రించకూడ‌దు. అయితే, కోరిన స‌మాచారం వ‌ల్ల ర‌క్ష‌ణ‌, సార్వ‌భౌమాధికారం, భ‌ద్ర‌త విష‌యాల్లో ఉల్లంఘ‌న జ‌రుగుతుంది అనుకున్న‌ప్పుడు మాత్రం నిరాక‌రించొచ్చు.

7. ఈ ఒప్పంద ప్ర‌కారం… ప్రాతినిధ్యం వ‌హిస్తున్న దేశాల న్యాయ‌స్థానాల్లో జ‌రిగే న్యాయ విచార‌ణ ప్ర‌క్రియ‌ల‌కు పూర్తి స‌హ‌కారం అందించుకోవాలి. ఎలాంటి బ‌ల‌వంతానికి తావు లేకుండా ప్రాతినిధ్య దేశీయుల నుంచి డిప్లొమాటిక్ అండ్ కౌన్సెల‌ర్ ప్ర‌తినిధుల నుంచి సాక్ష్యాలు తీసుకుంటుంది.

8. ఆమోద ప‌త్రాల‌ను ఉభ‌యులూ మార్చుకున్నాక 30 రోజుల్లో ఈ ఒప్పందం అమ‌ల్లోకి వ‌స్తుంది. ఎవ‌రైనా స‌రే, ఆరు నెల‌లు ముంద‌స్తుగా నోటీసులు ఇచ్చి తొల‌గించేవర‌కూ ఈ ఒప్పందం అమ‌లులో ఉంటుంది.

9. ఈ ఒప్పందంలోని నిబంధ‌న‌లు సివిల్ ప్రొసీజర్ 1908 నియమావళికి, ఆర్బిట్రేష‌న్ అండ్ క‌న్సీలియేష‌న్ చ‌ట్టం, 1996కి లోబ‌డి ఉన్నాయి.

ఈ ఒప్పందం ఇరు దేశాల పౌరుల‌కూ ఎంతో ప్ర‌యోజ‌క‌రంగా ఉంటుంది. ఇరు దేశాల మ‌ధ్య స్నేహ‌పూర్వ‌క సంబంధాలు పెర‌గ‌డానికీ, చ‌ట్ట‌-న్యాయ ప‌ర‌మైన అంశాల్లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంలోనూ, సాంస్కృతిక సంబంధాల‌ను మెరుగు ప‌ర‌చ‌డంలోనూ ఈ ఒప్పందం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ ఒప్పందం ముందుమాటలోని సారాంశం కూడా ఇదే.

నేప‌థ్యం…

వాణిజ్య‌, పౌర వ్య‌వ‌హారాల్లో కుదిరిన మ్యుచువ‌ల్ లీగ‌ల్ అసిస్టెన్స్ ట్రీటీ (ఎమ్‌.ఎల్‌.టి.ఎ.)…. 1908 (సీపీసీ), సెక్ష‌న్ 29 (సి) ప్ర‌కారం విదేశాల‌కు స‌మ‌న్లు జారీచేయ‌డంలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం… సీపీసీలోని సెక్ష‌న్ 44ఎ ప్ర‌కారం డిక్రీల అమ‌లు… సీపీసీ సెక్ష‌న్ 77 ప్ర‌కారం అభ్య‌ర్థ‌న ఉత్త‌రాల జారీ చేయ‌డం… సీపీసీ సెక్ష‌న్ 78 ప్ర‌కారం సాక్ష్యాధారాల‌ను తీసుకోవ‌డం… 1996, ఆర్బిట్రేష‌న్, స‌ర్దుబాటు చ‌ట్టంలోని 44(బి) ప్రకారం మ‌ధ్య‌వ‌ర్తిత్వం జ‌రుగుతుంది. ఈ ఒప్పందానికి సంబంధించి 2003 నుంచీ భార‌త్‌-ఒమెన్ దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. 2010 మే 16-18 తేదీల మ‌ధ్య భార‌త ప్ర‌తినిధి బృందం ఒమెన్‌లో ప‌ర్య‌టించింది. ఆ సంద‌ర్భంలోనే పౌర, వాణిజ్య వ్య‌వ‌హారాలకి సంబంధించిన మ్యూచువ‌ల్ లీగ‌ల్ అసిస్టెన్స్ ట్రీటీ డ్రాప్ట్‌పై చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఈ ఒప్పందం నిబంధ‌న‌లు 1996, ఆర్బిట్రేష‌న్ అండ్ క‌న్సీలియేష‌న్ చ‌ట్టంలోని నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే ఉన్నాయి. శాస‌నాల్లో ఎలాంటి స‌వ‌ణ‌లూ అవ‌స‌రం లేదు. భార‌త పౌరులు, భాగ‌స్వామ్య‌ దేశాల పౌరుల మ‌ధ్య ఎలాంటి వివ‌క్ష‌నూ సివిల్ ప్రొసీజర్ కోడ్ చూప‌దు.