Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌త్ – న్యూజిలాండ్‌ల మ‌ధ్య గ‌గ‌న‌త‌ల సేవ‌లకు సంబంధించి స‌వ‌రించిన ఒప్పందంపై సంత‌కాలు


ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం భార‌త్ – న్యూజిలాండ్ ల మ‌ధ్య గ‌గ‌న‌త‌ల సేవ‌లకు సంబంధించిన స‌వ‌రించిన ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం ఇరు దేశాల పౌర విమాన‌యాన సంబంధాల‌లో ఒక కీల‌క‌మైన మైలురాయి అని చెప్ప‌వ‌చ్చు. అంతేకాకుండా ఉభ‌య దేశాల మ‌ధ్య మ‌రింత ఎక్కువ వ్యాపారం, పెట్టుబ‌డులు, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక సంబంధాల‌ను ఏర్పాటుచేసేందుకు ఈ ఒప్పందం బాట వేస్తుంది కూడా.