పిఎంఇండియా
నేరపరమైన కేసుల్లో భారత్, మాల్దీవుల మధ్య న్యాయ సాయం చేసుకోవటానికి వీలు కల్పించే ఒప్పందంపై సంతకాలు చేయటానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ అనుమతించింది. పరస్పర సహకారం ద్వారా రెండు దేశాల్లోనూ నేరపరమైన కేసుల్లో దర్యాప్తు, విచారణ మరింత పటిష్ఠంగా జరగటానికి ఈ ఒప్పందం వీలు కలిపిస్తుంది. ఉగ్రవాదంతో ముడిపడ్డ అంత రాష్ట్ర్రీయ నేరాల విషయంలో దర్యాప్తు, విచారణలతో పాటు ఉగ్రవాద చర్యలకు ఉద్దేశించిన ఆస్తులు, పరికరాల జప్తులకు సంబంధించి కూడా మాల్దీవులతో ద్వైపాక్షిక సహకారానికి అవసరమైన విశాల న్యాయ చట్రానికి ఈ ప్రతిపాదిత ఒప్పందం ద్వారా అవకాశం కలుగుతుంది.