Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌త‌దేశంలో ఒక‌ట‌వ హై స్పీడ్ రైలు ప్రాజెక్టుకు పునాదిరాయి వేసిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, జ‌పాన్ ప్ర‌ధాని శ్రీ శింజో ఆబే

భార‌త‌దేశంలో ఒక‌ట‌వ హై స్పీడ్ రైలు ప్రాజెక్టుకు పునాదిరాయి వేసిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, జ‌పాన్ ప్ర‌ధాని శ్రీ శింజో ఆబే

భార‌త‌దేశంలో ఒక‌ట‌వ హై స్పీడ్ రైలు ప్రాజెక్టుకు పునాదిరాయి వేసిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, జ‌పాన్ ప్ర‌ధాని శ్రీ శింజో ఆబే


ముంబ‌యి మ‌రియు అహ‌మ‌దాబాద్ ల మ‌ధ్య న‌డిచే హై స్పీడ్ రైలు ప్రాజెక్టుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, జ‌పాన్ ప్ర‌ధాని శింజో ఆబే లు ఈ రోజు శంకు స్థాప‌న చేశారు; ఇటువంటి ప్రాజెక్టు భార‌త‌దేశంలో ఇదే మొద‌టిది.

ఈ సంద‌ర్భంగా అహ‌మ‌దాబాద్ లో ఏర్పాటైన ఒక పెద్ద బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి పాల్గొని మాట్లాడుతూ, ‘‘న్యూ ఇండియా’’ యొక్క మ‌హ‌త్వాకాంక్ష‌ గురించి, ఇంకా మ‌నోబ‌లం గురించి వివ‌రించారు. భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న త‌న అభినంద‌న‌లు తెలియ‌జేస్తూ, బులెట్ రైలు ప్రాజెక్టు వేగానికి, పురోగ‌తికి దోహదపడుతుందని, అంతేకాకుండా ఇది శీఘ్ర ఫ‌లితాల‌ను కూడా ప్ర‌సాదిస్తుంద‌న్నారు. అధిక వేగ‌వంత‌మైన అనుసంధానం ద్వారా ఉత్పాద‌క‌త‌ను పెంచ‌డంపై ప్ర‌భుత్వం శ్ర‌ద్ధ వ‌హిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం భార‌త‌దేశానికి సాంకేతికంగాను, ఆర్థికంగాను స‌హాయం అందిస్తున్నందుకు జ‌పాన్ కు ప్ర‌ధాన మంత్రి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇంత త‌క్కువ కాలంలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నందుకు ప్ర‌ధాని శ్రీ ఆబే ను ఆయ‌న ప్ర‌శంసించారు.

ఈ అధిక వేగ‌వంత‌మైన రైలు మార్గం రెండు న‌గ‌రాల‌ను స‌న్నిహితం చేయ‌డ‌ంతో పాటు వంద‌లాది కిలో మీట‌ర్ల దూరంలో నివ‌సిస్తున్న‌టువంటి ప్ర‌జ‌ల‌ను ఒక‌రి చెంతకు మ‌రొక‌రిని తీసుకువ‌స్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ముంబ‌యి – అహ‌మ‌దాబాద్ కారిడార్ వెంబ‌డి ఒక కొత్త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి ప‌ర‌చ‌డం జ‌రుగుతుంద‌ని, ఆ ప్రాంతం అంతా ఒకే ఆర్థిక మండ‌లంగా అవ‌త‌రిస్తుంద‌ని ఆయ‌న అన్నారు.

స‌గ‌టు మ‌నిషికి లాభం చేకూర్చిన‌ప్పుడే సాంకేతిక విజ్ఞానం ప్రయోజనకారి కాగలదని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చోటు చేసుకొనే సాంకేతిక ప‌రిజ్ఞాన మార్పిడి భార‌తీయ రైల్వేల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించ‌డంతో పాటు ‘‘మేక్ ఇన్ ఇండియా’’ కార్య‌క్ర‌మానికి ఊతాన్నిస్తుంద‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు మాన‌వ మైత్రీ పూర్వ‌క‌మైన ప్రాజెక్టు కావ‌డ‌మే కాకుండా ప‌ర్యావ‌ర‌ణ స్నేహ పూర్వ‌క‌మైన ప్రాజెక్టు కూడా అని ఆయ‌న అభివ‌ర్ణించారు. భ‌విష్య‌త్తులో ‘‘హై – స్పీడ్ కారిడార్స్‌’’ స‌త్వ‌ర వృద్ధికి నిల‌యాలు అవుతాయని ఆయ‌న అన్నారు.

భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌ను దృష్టి పెట్టుకొని మౌలిక స‌దుపాయాల‌ను తీర్చిదిద్దేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టును సాధ్య‌మైనంత స్వ‌ల్ప కాలంలోనే పూర్తి చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రు క‌ల‌సి కృషి చేయ‌గ‌ల‌రన్న విశ్వాసాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.

అంత క్రితం జ‌పాన్ ప్ర‌ధాని శ్రీ శింజో ఆబే మాట్లాడుతూ, భార‌త‌దేశం, జ‌పాన్ ల భాగ‌స్వామ్యం ప్ర‌త్యేక‌మైందీ, వ్యూహాక‌త్మ‌క‌మైందే కాక ప్ర‌పంచ స్థాయి క‌లిగిన‌టువంటిదని తెలిపారు. రాగ‌ల కొన్నేళ్ళ‌లో బులెట్ రైలు కిటికీల‌లో నుండి భార‌త‌దేశం శోభ‌ను వీక్షించాల‌ని తాను ఆశిస్తున్నట్లు ఆయ‌న పేర్కొన్నారు.

***