Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌త‌దేశం-జ‌పాన్ విదేశీ వ్య‌వ‌హారాలు మ‌రియు ర‌క్ష‌ణ మంత్రుల సంభాష‌ణ లో భాగం గా ప్రారంభిక స‌ద‌స్సు జ‌రిగింది


భార‌త‌దేశం-జ‌పాన్ విదేశీ వ్య‌వ‌హారాలు మ‌రియు ర‌క్ష‌ణ మంత్రుల సంభాష‌ణ (2+2)లో భాగం గా ప్రారంభిక స‌ద‌స్సు ఈ రోజు న ఇక్క‌డ‌ జ‌రిగింది. 2018వ సంవ‌త్స‌రం అక్టోబ‌రు లో జ‌పాన్ లో జ‌రిగిన ఇండియా-జ‌పాన్ ప‌ద‌మూడో వార్షిక శిఖ‌ర స‌మ్మేళ‌నం సంద‌ర్భం లో ద్వైపాక్షిక ర‌క్ష‌ణ మ‌రియు భ‌ద్ర‌త సంబంధిత స‌హ‌కారాన్ని గాఢ‌తరం చేసుకోవ‌డం కోసం విదేశీ మ‌రియు ర‌క్ష‌ణ వ్యవ‌హారాల మంత్రుల సంభాష‌ణ ను నిర్వ‌హించాల‌ని జ‌పాన్ ప్ర‌ధాని శ్రీ శింజో ఆబే మ‌రియు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీసుకొన్న నిర్ణ‌యాని కి అనుగుణం గా ఈ స‌మావేశం జ‌రిగింది.

ఈ 2+2 సంభాషణ కై భార‌త‌దేశ ప్ర‌తినిధి వ‌ర్గాని కి ర‌క్ష‌ణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ మ‌రియు విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి డాక్ట‌ర్ ఎస్‌. జ‌య‌శంక‌ర్ నాయ‌క‌త్వం వ‌హించారు. కాగా, జ‌పాన్ ప్ర‌తినిధి వ‌ర్గాని కి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ తోశిమిత్సు మోతెగి మ‌రియు జ‌పాన్ ర‌క్ష‌ణ శాఖ మంత్రి శ్రీ తారొ కొనొ నాయ‌క‌త్వం వ‌హించారు.

ప్ర‌స్తుతం జ‌పాన్ కు మ‌రియు భార‌త‌దేశాని కి మ‌ధ్య గ‌ల ర‌క్ష‌ణ ప‌ర‌మైన, భ‌ద్ర‌త ప‌ర‌మైన స‌హ‌కారం యొక్క స్థితి ని స‌మీక్షించేందుకు, అలాగే ఆ సహకారాన్ని బలోపేతం చేసుకోవడం పై ఒక‌ పక్షం అభిప్రాయాల ను మ‌రొక‌ పక్షాని కి వెల్ల‌డించేందుకు ఈ స‌మావేశం ఉభయ పక్షాల కు ఒక అవకాశాన్ని ఇచ్చింది. త‌ద్వారా ‘ఇండియా-జ‌పాన్ స్పెశ‌ల్ స్ట్ర‌టీజిక్ ఎండ్ గ్లోబ‌ల్ పార్ట్‌న‌ర్ శిప్’కు మ‌రింత గాఢ‌త ను సంతరించాల‌నేది దీని ఉద్దేశ్యం గా ఉంది.

ఇండో-ప‌సిఫిక్ ప్రాంతం లో నెల‌కొన్న ప‌రిస్థితి ప‌ట్ల సైతం ఉభ‌య ప‌క్షాలు త‌మ త‌మ అభిప్రాయాల ను ఈ స‌మావేశం సంద‌ర్భం గా వెలిబుచ్చాయి. అంతేకాకుండా, భార‌త‌దేశం మ‌రియు జ‌పాన్ రెండు దేశాల ప్ర‌జ‌ల కు మ‌రింత మెరుగైన భ‌విష్య‌త్తు ను ప్ర‌సాదించ‌డం కోసం శాంతి, స్థిర‌త్వం, ఇంకా ప్ర‌గ‌తి సాధ‌న లో క‌ల‌సి ముంద‌డుగు వేసేందుకు జ‌పాన్ అనుస‌రిస్తున్న ‘ఫ్రీ ఎండ్ ఓపెన్ ఇండో-ప‌సిఫిక్ విజ‌న్’ మ‌రియు భార‌త‌దేశం అవ‌లంబిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్ పాలిసి’ ల ప‌రిధి లో సాగుతున్న‌ కృషి ని కూడా ఇరు ప‌క్షాలు స‌మీక్షించాయి.