Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భోపాల్ లోని భోపాల్ మెమోరియ‌ల్ హాస్పిట‌ల్ అండ్ రిస‌ర్చ్ సెంట‌ర్ లో విధులు నిర్వ‌హిస్తున్న జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, స్పెష‌లిస్ట్ గ్రేడ్ డాక్ట‌ర్లు మ‌రియు టీచింగ్ మెడిక‌ల్ ఫేక‌ల్టీ యొక్క ఉద్యోగ విర‌మ‌ణ వ‌య‌స్సు పెంపున‌కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


భోపాల్ లోని భోపాల్ మెమోరియ‌ల్ హాస్పిట‌ల్ అండ్ రిస‌ర్చ్ సెంట‌ర్ (బిఎంహెచ్ఆర్ సి) లో విధులు నిర్వ‌హిస్తున్న జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, స్పెష‌లిస్ట్ గ్రేడ్ డాక్ట‌ర్లతో పాటు టీచింగ్ మెడిక‌ల్ ఫేక‌ల్టీ యొక్క ఉద్యోగ విర‌మ‌ణ వ‌య‌స్సు ను పెంచ‌డం కోసం ఆరోగ్యం మ‌రియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కు చెందిన ఆరోగ్య ప‌రిశోధ‌న విభాగం చేసినటువంటి ప్ర‌తిపాద‌న‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  వీరి వ‌య‌స్సును కేంద్ర ప్ర‌భుత్వ ఆసుప‌త్రులు/స‌ంస్థ‌ లలో ప‌ని చేస్తున్న వైద్యులు మ‌రియు కేంద్ర ఆరోగ్య సేవ‌లకు చెందిన వైద్యుల‌తో స‌మానంగా అర‌వై అయిదు సంవ‌త్స‌రాల‌కు పెంచాల‌న్న‌ది ప్ర‌తిపాద‌న‌.
         
కేంద్ర ఆరోగ్య సేవ‌ల కు చెందిన బోధ‌న‌, బోధ‌నేత‌ర, ఇంకా ప‌బ్లిక్ హెల్త్ స‌బ్-కేడ‌ర్ లో జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, ఇంకా స్పెష‌లిస్టు ల విష‌యంలో ఉద్యోగ విర‌మ‌ణ వ‌య‌స్సు ను 2018 జ‌న‌వ‌రి లో విడుద‌ల చేసిన ఒక నోటిఫికేష‌న్ ప్ర‌కారం అర‌వై అయిదు సంవ‌త్స‌రాల‌కు పెంచ‌డం జ‌రిగింది.  
 
ప్ర‌భుత్వ నిర్ణ‌యం బిఎమ్‌హెచ్ఆర్‌సి లో ఫేక‌ల్టీ డాక్ట‌ర్లు మ‌రియు స్పెష‌లిస్టు డాక్ట‌ర్ల కొర‌త‌ ను భ‌ర్తీ చేయ‌డానికి ఉప‌యోగప‌డుతుంది.  అంతేకాకుండా, భోపాల్ గ్యాస్ విషాదాంతం యొక్క బాధితులకు మ‌రియు వారి కుటుంబ స‌భ్యుల‌కు రోగ చికిత్స స‌దుపాయాన్ని కూడా మెరుగుప‌ర‌చ‌గ‌లుగుతుంది. 

****