Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మలయాళ మనోరమ కాన్‌క్లేవ్‌ 2019 ని ఉద్దేశించి ప్ర‌సంగించిన‌ ప్ర‌ధాన మంత్రి


 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న‌ కోచి లో జ‌రిగిన‌ మలయాళ మనోరమ న్యూజ్ కాన్‌క్లేవ్‌ 2019 ని ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సంగించారు.
 
కేర‌ళ పౌరుల ను మ‌రింత అవ‌గాహ‌న క‌లిగిన వారు గా తీర్చిదిద్ద‌డం లో మ‌రియు భార‌త‌దేశ స్వాతంత్య్ర ఉద్య‌మాని కి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లో మ‌ల‌యాళ మ‌నోర‌మ యొక్క తోడ్పాటు ను ప్ర‌ధాన మంత్రి ప్రశంసించారు.
 
ఉమ్మ‌డి ఆకాంక్ష‌లు ‘న్యూ ఇండియా’ కు కేంద్ర స్థానం లో నిల‌చాయి:
 
ఈ స‌మావేశం ఇతివృత్తం అయిన‌టువంటి ‘న్యూ ఇండియా’ అంశం పై ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ‘‘వ్య‌క్తిగ‌త ఆకాంక్ష‌లు, సామూహిక ప్ర‌యాసల తో పాటు జాతీయ పురోగ‌తి లో యాజమాన్యం కోసం స్ఫూర్తి.. ఇవ‌న్నీ ‘న్యూ ఇండియా’కు కేంద్ర స్థానం లో నిల‌చాయ‌న్నారు.  ప్రాతినిధ్య త‌ర‌హా ప్ర‌జాస్వామ్యం, పౌర సేవ‌ల ప‌ట్ల త‌త్ప‌ర‌త క‌లిగిన ప్ర‌భుత్వం  మ‌రియు పౌర సేవ‌ల ప‌ట్ల సానుకూల దృక్ప‌థం.. వీట‌న్నిటినీ ‘న్యూ ఇండియా’ ప్ర‌తిబింబిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.  ‘న్యూ ఇండియా’ స్ప‌ంద‌న శీలురైన ప్ర‌జ‌ల శకం మ‌రియు స్పందనశీలం కలిగినటువంటి ప్ర‌భుత్వం యొక్క శ‌కం అని ఆయ‌న అన్నారు.

వేరు వేరు రంగాలు.. అది క్రీడా రంగం కావ‌చ్చు లేదా స్టార్ట్-అప్ ఇకో-సిస్ట‌మ్ కావ‌చ్చు.. వాటి లో ‘న్యూ ఇండియా’ యొక్క స్ఫూర్తి ప్ర‌స్తుతం దృగ్గోచరం అవుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  చిన్న చిన్న ప‌ల్లెల నుండి, చిన్న చిన్న ప‌ట్ట‌ణాల నుండి వ‌స్తున్న ధైర్య‌వంతులైన యువ‌తీయువ‌కులు వారి ఆకాంక్ష ను ప్రావీణ్యం రూపం లోకి ప‌రివ‌ర్త‌న చేసుకొని మరీ భార‌త‌దేశం గ‌ర్వపడేటట్టు చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.  ఈ సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి ‘‘ఇది నా దృష్టి లో ‘న్యూ ఇండియా’ స్పిరిట్ వలె ఉంది.  ఇది యువ‌త యొక్క ఇంటి పేర్ల‌ కు ప్రాధాన్యం లేని భారతదేశం.  ఈ భారతదేశం లో ప్రాధాన్యం ఉన్న‌ద‌ల్లా వారి యొక్క సొంత పేరు ను తెచ్చుకోగ‌లిగిన వారి లోని సామ‌ర్ధ్య‌మే.  ఇది అవినీతి ఒక ఐచ్చికం గా ఎన్న‌టికీ  ఉండ‌ని భారతదేశం.  అటువంటి భారతదేశంలో ఒక్క ద‌క్ష‌తే నియ‌మం గా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.  ‘న్యూ ఇండియా’ 130 కోట్ల మంది భార‌తీయుల లో ప్ర‌తి ఒక్క‌రి స్వ‌రం.  ఈ ప్ర‌జావాణి ని ఆల‌కించ‌డం ప్ర‌సార మాధ్య‌మ వేదిక‌ల కు చాలా ముఖ్యమైందిగా మారాలి అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  

ప్ర‌భుత్వం చేసిన ప‌నుల ను గురించి ఆయ‌న వివ‌రిస్తూ- ‘ఈజ్ ఆఫ్ లివింగ్’, ధ‌ర‌ల ను అదుపు లో ఉంచ‌డం, అయిదు సంవ‌త్స‌రాల‌ లో 1.25 కోట్ల గృహాల‌ ను నిర్మించ‌డం, అన్ని గ్రామాల ను విద్యుత్తు సౌక‌ర్యం క‌లిగిన‌వి గా తీర్చిదిద్ద‌డం, ప్ర‌తి ఒక్క కుటుంబాని కి నీటి స‌ర‌ఫ‌రా, ఆరోగ్య సంబంధమైన మౌలిక స‌దుపాయాల ను మ‌రియు విద్య సంబంధమైన మౌలిక స‌దుపాయాల ను మెరుగు ప‌ర‌చ‌డం జ‌రిగాయి- అని తెలిపారు.  36 కోట్ల బ్యాంకు ఖాతాల ఆరంభం, చిన్న వ్యాపార సంస్థ‌ల కు 20 కోట్ల రుణాల అంద‌జేత‌, 8 కోట్ల కు పైగా గ్యాస్ క‌నెక్ష‌న్ లతో పొగ కు తావు ఉండనటువంటి వంట గ‌దుల కు పూచీ ప‌డ‌టం, ర‌హ‌దారి నిర్మాణ వేగాన్ని రెట్టింపు చేయ‌డం గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు.
 
‘‘మ‌నం సాధించగ‌ల‌మా’’ ద‌శ నుండి ‘‘మ‌నం సాధించ‌గ‌లుగుతాము’’ అనే ద‌శ కు..

‘‘భార‌త‌దేశం లో ఉత్సాహం ఏ విధం గా మార్పు చెందిందీ కేవ‌లం రెండు మాట‌ల లో చెప్ప‌వ‌చ్చని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  అయిదేళ్ళ క్రితం ప్ర‌జ‌లు మ‌నం సాధించ‌గ‌ల‌మా? మ‌నం ధూళి, దుమ్ము ల బారి నుండి విముక్తం కాగ‌ల‌మా?  విధాన‌ప‌ర‌మైన‌టువంటి జ‌డ‌త్వాన్ని మ‌నం ఏనాటికైనా విముక్తి ని పొంద‌గ‌ల‌మా?  అవినీతి ని మ‌నం ఎప్ప‌టికైనా నిర్మూలించ‌గ‌ల‌మా? అనే ప్ర‌శ్న‌లు వేసే వారు.  ఈ రోజు న ప్ర‌జ‌లు మ‌నం సాధించ‌ గ‌లుగుతాము అని అంటున్నారు.  మ‌నం స్వ‌చ్ఛ భార‌త్ ను ఆవిష్క‌రించుకోగ‌లము.  మ‌నం అవినీతి కి తావు లేన‌టువంటి ఒక దేశం గా ఆవిర్భ‌వించ‌గ‌లుగుతాము.  మ‌నం సుప‌రిపాల‌న‌ ను ఒక ప్ర‌జా ఆందోళ‌న గా మార్చ‌గ‌లుగుతాము.  ఇంత‌కు ముందు ఒక నిరాశా భ‌రిత‌మైన‌టువంటి ప్ర‌శ్న ను లేవ‌నెత్తిన‌  ‘విల్’ అనే ప‌దం ప్ర‌స్తుతం ఒక యువ‌జ‌న భ‌రిత దేశం తాలూకు ఆశావాద భావ‌న గా ప్ర‌తిఫ‌లిస్తోంది.’’

ప్ర‌భుత్వం ఒక ‘న్యూ ఇండియా’ను  ఆవిష్క‌రించ‌డానికి స‌మ‌గ్ర దృక్ప‌థం తో కృషి చేస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఈ సంద‌ర్భంలో ఆయ‌న పేద‌ల‌ కు 1.5 కోట్ల ఇళ్ళ‌ ను నిర్మించ‌డం లో ప్ర‌భుత్వం యొక్క విధానాన్ని గురించి వివరించారు.  తాము మ‌రిన్ని సౌక‌ర్యాల ను అంద‌జేయ‌డాని కి, మ‌రింత విలువ‌ను అందించ‌డాని కి, త‌క్కువ కాలం లో మ‌రే అద‌న‌పు వ్య‌యాని కి తావు ఇవ్వ‌కుండా చూడ‌టాని కి ఒక సంపూర్ణమైన విధానాన్ని అనుస‌రించిన‌ట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు.  ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ ను తెలుసుకొని స్థానిక చేతి ప‌ని వృత్తి వారి ని చేర‌దీసి మ‌రి సాంకేతిక విజ్ఞానాన్ని ఈ పథకం యొక్క ముఖ్య‌మైన ప్ర‌క్రియ గా జోడించ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న అన్నారు.  

‘న్యూ ఇండియా’ ఆవిష్కారం కోసం మా దార్శ‌నిక‌త లో కేవ‌లం దేశం లోప‌ల నివ‌సించే వారి ని గురించే శ్ర‌ద్ధ తీసుకోవ‌డం కాకుండా దేశం వెలుప‌ల నివ‌సిస్తున్నటువంటి భారతీయులను కూడా చేర్చడం జరిగింద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.  భార‌త‌దేశం యొక్క ఆర్థిక వృద్ధి కి తోడ్పాటు ను అందిస్తున్న విదేశాల‌ లోని మన వారు మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణం గా ఉన్నారని ఆయన అన్నారు.

బ‌హ్రెయిన్ లో ఇటీవ‌ల తాను జ‌రిపిన ప‌ర్య‌ట‌న‌ ను గురించి ఆయ‌న మాట్లాడుతూ, అక్క‌డ‌ కు వెళ్ళిన ప్ర‌ప్ర‌థ‌మ భార‌తీయ ప్ర‌ధాన మంత్రి అనే గౌర‌వం త‌న‌కు ద‌క్కింద‌ని తెలిపారు.   త‌న ప‌ర్య‌ట‌న లోని ముఖ్యాంశాల లో అక్క‌డ శిక్ష‌ల‌ను అనుభ‌విస్తున్న 250 మంది భార‌తీయుల కు రాజ కుటుంబం క్ష‌మాబిక్ష ను ప్ర‌సాదిస్తూ తీసుకున్న‌టువంటి దయార్ధ్ర నిర్ణ‌యం ఒక‌టిగా ఉందని ఆయ‌న ప్ర‌స్తావించారు.  యుఎఇ లో రూపే కార్డు ను ప్రారంభించ‌డం గురించి కూడా ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు.  ఇది గ‌ల్ఫ్ లో ప‌ని చేస్తూ స్వదేశానికి చెల్లింపులు జరుపుతున్న ల‌క్షలాది ప్ర‌జ‌ల కు ఉప‌యోగ‌క‌రం గా ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు.  

స్వ‌చ్ఛ్ భార‌త్, ఒకమారు ఉపయోగిస్తున్న ప్లాస్టిక ను మానివేయడం, జ‌ల సంర‌క్ష‌ణ, ఫిట్ ఇండియా సహా అనేక ఉద్య‌మాల లో ప్ర‌సార మాధ్య‌మాలు పోషించిన సార్థక పాత్ర ను గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ప్ర‌ముఖం గా ప్ర‌స్తావించారు.
 
ఏకం చేసే శ‌క్తి భాష కు ఉంది:

భార‌త‌దేశాన్ని ఏకం చేసే శ‌క్తి భాష కు ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి నొక్కి ప‌లుకుతూ, వివిధ భాష‌ల ను  మాట్లాడుతున్న ప్ర‌జ‌ల ను స‌న్నిహితం గా తీసుకు వ‌చ్చేందుకు ఒక సేతువు వంటి పాత్ర ను ప్ర‌సార మాధ్య‌మాలు పోషించ‌గ‌లవా? అంటూ ప్ర‌శ్నించారు.   10-12 వేరు వేరు భాష‌ల లోని ఒక ప‌దాన్ని ప్ర‌సార మాధ్య‌మాలు ప్ర‌చురించ‌వ‌చ్చ‌ని ఆయ‌న సూచించారు.  ఈ విధం గా ఒక సంవ‌త్స‌ర కాలం లో ఒక వ్య‌క్తి వివిధ భాష‌ల లో 300కు పైగా కొత్త ప‌దాల‌ ను నేర్చుకోవ‌చ్చ‌ని చెప్పారు.  ఒక వ్య‌క్తి మ‌రొక భార‌తీయ భాష ను నేర్చుకొంటే, ఆ వ్య‌క్తి ఉమ్మ‌డి బంధాల ను తెలుసుకోవ‌చ్చున‌ని, అంతేకాకుండా భార‌తీయ సంస్కృతి లో ఉన్న ఏక‌త్వాన్ని వాస్త‌వం గా హ‌ర్షించ‌వ‌చ్చని ఆయ‌న వివ‌రించారు.

మ‌న పూర్వికుల క‌ల‌ల ను నెర‌వేర్చ‌డం మన కర్తవ్యం మ‌రి మనం నిర్మించే భారతదేశం భారతదేశ పూర్వికులకు గౌరవాన్వితులను చేస్తుంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 

***