పిఎంఇండియా
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ ఆలోచనలు యావత్ ప్రపంచానికి స్ఫూర్తినిచ్చాయని, అవి మానవత్వంతో అనుసంధానమై ఉన్నంతకాలం వాటి ప్రాధాన్యత కొనసాగుతుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ స్వదేశీని స్వీకరించడంపై ఇచ్చిన ప్రాధాన్యతను, అందులో ఖాదీకి అత్యంత ప్రముఖ స్థానం కల్పించిన విషయాన్ని కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు.
అక్టోబర్ 2వ తేదీన కనీసం ఒక ఖాదీ ఉత్పత్తిని కొనుగోలు చేసి, దానిని స్వదేశీ అని చెప్పుకోవడంలో గర్వపడాలని శ్రీ మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. బాపూజీ శాశ్వత సందేశం సమాజాన్ని మరింత మెరుగైన సమాజం, వికసిత్ భారత్ వైపు నడిపిస్తూనే ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
“బాపూజీ శాశ్వత సందేశం మనల్ని మరింత మెరుగైన సమాజం, వికసిత్ భారత్ వైపు నిరంతరం నడిపిస్తూనే ఉండాలి.
#గాంధీజయంతి’’
May Bapu’s timeless message keep guiding us towards a better society and a Viksit Bharat. #GandhiJayanti pic.twitter.com/nEISzsM37X
— Narendra Modi (@narendramodi) October 2, 2026