Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహారాణా ప్రతాప్ జయంతి… ప్రధానమంత్రి నివాళులు


పరాక్రమశాలి, యోధుడు మహారాణా ప్రతాప్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

 
ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘
దేశ అమర సేనాని మహారాణా ప్రతాప్‌నకు ఆయన జయంతి సందర్భంగా కోటానుకోట్ల వందనాలు. మాతృభూమి గౌరవాన్ని సంరక్షించడానికి ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలు, శౌర్యం ఈనాటికీ మన వీరులకు, వీరాంగనలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. భరత మాతకు అంకితమైన ఆయన పరాక్రమ భరిత జీవనం దేశ ప్రజలకు సదా ప్రేరణను ఇస్తూ ఉంటుంది’’ అని పేర్కొన్నారు.‌   ‌