పిఎంఇండియా
మహారాష్ట్రలోని పర్భణీలో గోడ కూలి ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతగానో కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
‘‘మహారాష్ట్రలోని పర్భణీలో గోడ కూలడం వల్ల ప్రాణనష్టం సంభవించడం తీవ్ర విచారకరం. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
***
The loss of lives due to the collapse of a wall in Parbhani, Maharashtra, is deeply saddening. My thoughts are with those who have lost their loved ones in this mishap. May the injured recover at the earliest: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 20, 2026
महाराष्ट्रात, परभणी येथे भिंत कोसळल्यामुळे झालेल्या जीवितहानीबद्दल अत्यंत दु:ख होत आहे. या दुर्घटनेत ज्यांनी आपल्या प्रियजनांना गमावले आहे, माझ्या संवेदना त्यांच्यासोबत आहेत. जखमींच्या प्रकृतीत लवकरात लवकर सुधार व्हावा, ही प्रार्थना: पंतप्रधान @narendramodi
— PMO India (@PMOIndia) June 20, 2026