Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రధానమంత్రి


ఈ రోజు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

డాక్టర్ సింగ్ అనేక సంవత్సరాలు ప్రజా జీవితంలో గడిపారని, అంకితభావంతో దేశానికి సేవ చేశారని ప్రధానమంత్రి కొనియాడారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

‘‘మన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ప్రజా జీవితంలోనే అనేక సంవత్సరాలు గడిపారు. అంకితభావంతో దేశానికి సేవలు చేశారు.’’