Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాస్కో ఎన్.సి.ఎం.సి. ని రేపు సందర్శించనున్న భారత ప్రధాని


భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు (డిసెంబరు 24, 2015) రష్యాలోని మాస్కో జాతీయ సంక్షోభ నిర్వహ‌ణ కేంద్రాన్ని (ఎన్.సి.ఎం.సి)ని సందర్శించనున్నారు.

అత్యవసర పరిస్థితులలో ఎదురయ్యే ప్రమాదాలను ముందుగా పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేసే ప్రధాన బాద్యత ఈ సంస్థది. బహుళ స్థాయిలలోని ప్రభుత్వ శాఖలు, అంతర్ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని ఏర్పరచి విపత్తులను ఎదుర్కొనేలా దోహదపడుతుంది.

విపత్తుల సమాచార సేకరణ, సమాచార విశ్లేషణ, టైం మానిటరింగ్ వంటి కీలక పనులను నిర్వహించే శక్తి సామర్థ్యాలు దీనికి ఉన్నాయి. రిమోట్ సెన్సింగ్ ద్వారా ప్రపంచ వాతావరణ స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్సు, ఇతర ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగిస్తుంది.

సునామీ హెచ్చరికలు, ప్రకృతి వైపరీత్యాల సమాచారాన్ని ముందస్తుగా తెలుసుకుంటుంది. జనసమ్మర్థ , పారిశ్రామిక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తుంది. నష్టాలు జరగకుండా నివారిస్తుంది. క్షణాల్లో సమాచారాన్ని రష్యా అంతటికి చేరవేసే అద్బుత శక్తి ఈ కేంద్రానికి ఉంది.