Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మూలాల్ని పరిరక్షించుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని సూచిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


మూలాధారాలైన జ్ఞానాన్నీరోజువారీ క్రమశిక్షణనీ పరిరక్షించుకోవడం అతి ప్రాధాన్యం గల విషయమని చాటిచెబుతున్న ఓ సంస్కృత భాషా సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

విప్రో వృక్షస్తస్య మూలం చ సన్ధ్యా వేదాశాఖా ధర్మకర్మాణి పత్రమ్

తస్మాన్మూలం యత్నతో రక్షణీయం ఛిన్నే మూలే నైవ శాఖా న పత్రమ్.

‘‘వివేకం కల వ్యక్తి వృక్షంతో సమానంజ్ఞాన స్వరూపం అనదగ్గ ఆ వృక్షానికినిత్య ఆరాధనే వేర్లువేదాలు ఆ వృక్షానికి శాఖలూమంచి పనులేమో ఆకులూనుఇందువల్లవేర్లను జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి.. ఎందుకంటేఒకవేళ వేర్లు నాశనమయ్యాయంటే అప్పుడు కొమ్మలూ ఉండవుఆకులూ మిగలవు.’’ అని ఈ సుభాషితం చెబుతోంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూఆ సందేశంలో 

‘‘విప్రో వృక్షస్తస్య మూలం చ సన్ధ్యా వేదా: శాఖా ధర్మకర్మాణి పత్రమ్

తస్మాన్మూలం యత్నతో రక్షణీయం ఛిన్నే మూలే నైవ శాఖా న పత్రమ్’’ అని పేర్కొన్నారు.

 

***